భాష సామెతలు
బంగారపు పళ్ళానికైనా గోడ అండ కావాలి
బంగారానికి తావి అబ్బినట్లు
బిందెడు ధనమిచ్చినా బావమరిది లేని సంబంధం వద్దు
బందరు లడ్డూలాగా
బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?
బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదు
బంధువులకు దూరం - బావికి దగ్గర
బంధువులంతా ఒక దిక్కు - బావమరిది ఇంకొక దిక్కు
బక్క ప్రాణం - కుక్క చావు
బట్టతలకూ - మోకాళ్ళకూ ముడి వేసినట్లు
బట్టతలమ్మకు పాపిట తీయమన్నట్లు
బట్టలిప్పి నీళ్ళు పోసుకుంటూ బావగారు వచ్చారని సిగ్గుతో చేతులెత్తి నుంచున్నదట
బడాయి బండెడు - బ్రతుకు తట్టెడు
బతకలేక బడిపంతులు
బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందట
బతికి చెడినవారితో వుండొచ్చుకానీ చెడి బతికిన వారితో వుండరాదు
బతికి చెడినవాడి బాధలు చూడు - చెడి బతికిన వాడి చేష్టలు చూడు
బతికి పట్నం - చచ్చి స్వర్గం చూడాలి
బతుకంత భయం లేదు - చావంత కష్టం లేదు
బతుకులెన్నాళ్ళు - భాగ్యాలెన్నాళ్ళు?
బద్ధకస్తుడికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువ
బయట తన్ని, యింట్లో కాళ్ళు పట్టుకున్నట్లు
బయట పులి - ఇంట్లో పిల్లి
బయటొక మాట - లోపల యింకో మాట
బరితెగించిన వాడు బజారుకు పెద్ద
బర్రె చస్తే పాడి బయటపడుతుంది
బర్రె, దూడ వుండగా గుంజకేలరా గురక రోగం?
బలం ఉడిగినా పంతం ఉడగదు
బలపం పట్టి భామవొళ్ళో ఓనమాలు దిద్దినట్లు
బలవంతపు బ్రాహ్మణార్థం
బల్ల క్రింద చేతులు
బల్లి పడిందని బావ ప్రక్కలో దూరినట్లు
బసవదేవునికి బడితె పూజ
బాదరాయణ సంబంధం
బాధకొక కాలం - భాగ్యానికొక కాలం
బాపన సేద్యం బత్తెం నష్టం
బాపన సేద్యం బత్తెం చేటు - కాపుల చదువులు కాసుల చేటు
బాపని సేద్యం బతకటానికీ రాదు - చావటానికీ రాదు
బాల జ్యోతిష్యం - వృద్ధ వైద్యం
బాలవాక్కు బ్రహ్మ వాక్కు
బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు
బావకు మరదలు పిల్లపై ఆశ
బావా! అంటే, ప్రక్కలోకి రావా! అన్నాడట
బావా! అని చూడబోతే, రావా? అని కొంగు లాగాడుట
బావి లోతు తెలుస్తుంది గానీ మనసు లోతు తెలియదు
బాహువుల పందిరిలో అధరాల ఆరాటం అందాల విందుకోసం అన్నట్లు
బిగికౌగిలి పొదరింట పరువాల విందులన్నట్లు
బిచ్చగాణ్ణి పొమ్మన్నా, ఉండమన్నా అత్తే చెప్పాలి
బిచ్చానికి పోయినా బిగువు తగ్గలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదు
బిడ్డ చచ్చినా ఉయ్యాల మీద తీపి పోలేదు
బిడ్డ చచ్చినా పీతికంపు పోలేదు
బిడ్డను దించి లోతు చూచినట్లు
బిడ్డలను కన్నమ్మా - భిక్షం వేసినమ్మా చెడరు
బిడ్డ వచ్చిన వేళ - గొడ్డు వచ్చిన వేళ
బీద కూటికి గానీ గుణానికి గారు
బీదైన మాత్రాన బింకం పోతుందా?
బుట్టలో కాపురం బూడిద పాలైనట్లు
బుట్టలో పేలాలు వేయించినట్లు
బుడ్డను నమ్ముకొని ఏట్లో దిగినట్లు
బుధవారం పుట్టిన ఎద్దు భూమిని దున్నినా, త్రొక్కినా భూమి పొర్లి పొర్లి పండుతుంది
బుధవారంనాడు పులికూడా వేటకు రాదు
బుద్ధి భూమినేలుతూంటే రాత గాడిదలు కాస్తోంది
బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావు
బురద గుంటలో పందిలాగా
బులుపు తీరితే గానీ బుద్ధిరాదు
బూడిదలో పోసిన పన్నీరు
బూతు లేనిదే నీతి లేదు
బెల్లం వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డ
బెల్లమున్నచోటే ఈగలు
బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం
బెల్లం ఉన్నంతసేపే ఈగలు - సిరి వున్నంతసేపే బలగం
బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా
బేరం చేస్తూ బ్లౌజు కొలతలడిగినట్లు
బొంకు నేర్చి రంకు నేర్వాలి
బొక్కలు పూడ్చి తూపులు తెరిచినట్లు
బొగ్గుల్లో మాణిక్యంలాగా
బొమ్మకు మ్రొక్కినా నమ్మకముండాలి
బొల్లెద్దుకు ముఖమే సాక్షి
బోగందాని చళ్ళకూ, సంతలో సొరకాయలుకూ గోటిగాట్లు ఎక్కువ
బోడిగుండుకు బొడ్డుమల్లెలు
బోడినెత్తిన కొబ్బరికాయ కొట్టినట్లు
బోడి పెత్తనం
బోనులో పడ్డ సింహంలాగా
బోగందానికి ఒక మగడా?
బోడి గుండంత సుఖం లేదు - ఊరుకున్నంత ఉత్తమం లేదు
బోసి నోటికి పేలపిండి ప్రీతి
బ్రతకని బిడ్డ బారెడు
బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు
బ్రతికితే వైద్యుడు బ్రతుకుతాడు - చస్తే బ్రాహ్మణుడు బ్రతుకుతాడు
బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది
బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట
బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు
బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావు
బ్రహ్మచారీ శతమర్కటః
బ్రహ్మజ్ఞానుల వారు వచ్చారు, పట్టుబట్టలు జాగ్రత్త అన్నట్లు
బ్రహ్మ తలిస్తే ఆయుష్షుకు కొదవా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదవా?
బ్రాహ్మణుడి ఆచారం నీటి కొద్దీ
బ్రాహ్మణుడి నోరు, ఏనుగు తొండం వూరుకోవు
బ్రాహ్మణుడికి పప్పాశ - అల్లుడికి అత్తాశ
భంగు తాగేవారికి హంగుగాళ్ళు పదిమంది
భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు
భక్తి లేని పూజ పత్రి చేటు
భగీరథ ప్రయత్నం
భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి
భరణి ఎండలకు బండలు - రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి
భరణి కురిస్తే ధరణి పండును
భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట
భరణిలో పుడితే ధరణిని ఏలు
భర్త లోకం తన లోకం - కొడుకు లోకం పరలోకం
భాగ్యముంటే బంగారం తింటారా?
భాంచేత్‌ దేవుడికి మాదర్చేత్‌ పత్రి
భార్యా రూపవతీ శత్రుః
భాషకు తగిన వేషం - ఈడుకు తగిన ఆచారం
భాషలు వేరైనా భావమొక్కటే
భూదేవంత ఓర్పుండాలి
భూమినీ రాజునీ కొలిచినవాడు చెడడు
భూతాలకి చింత బరికెలు
భోజనానికి ముందు - వేడినీళ్ళకు వెనుక
భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు
భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకుని వస్తానన్నట్లు
భోజనానికి పిలిస్తే రాకుండా దొడ్డిదారిన వచ్చి రోలు నాకినట్లు
భోజునివంటి రాజుంటే కాళిదాసువంటి కవీ వుంటాడు
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )