భాష సామెతలు
దంచలేనమ్మ ఊదూది చూచిందట
దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడు
దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు
దండుగలో దండుగ
దంపినందుకు బొక్కిందే కూలి
దంపినమ్మకు బొక్కిందే దక్కుడు
దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు
దగ్గరకు పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లు
దగ్గరకు వస్తే ఎగ్గు లెంచినట్లు
దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువ
దగ్గూ, గజ్జీ దాచినా దాగవు
దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?
దప్పిక కొన్నప్పుడు బావి త్రవ్వినట్లు
దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరికలేదు
దమ్మిడీ పెళ్ళికి ఏగానీ బోగం మేళం
దమ్మిడీ ముండకు ఏగానీ క్షవరం
దయలేని అత్తకు దణ్ణం పెట్టినా తప్పే - లేకున్నా తప్పే
దయ్యం పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి
దయ్యాలతో చెలిమి చేసినట్లు
దరిద్రానికి మించిన బాధ లేదు
దరిద్రానికి మాటలు హెచ్చు - తద్దినానికి కూరలు హెచ్చు
దరిద్రుడికి అంటనప్పుడు ఆముదం రాచినా అంటదు
దరిద్రుడికి ఏరేవు కెళ్ళినా ముళ్ళపరిగే
దరిద్రుడికి పిల్లలెక్కువ
దరిద్రుడి చేనుకు వడగండ్ల వాన
దరిద్రుడు తలగడుగబోతే వడగండ్ల వాన కురిసిందట
దరిద్రునికి దైవమే తోడు
దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపం
దరిలేని బావి - వితరణలేని ఈవి
దశకొద్దీ దొరికాడు దిసిమొల మొగుడు
దశకొద్దీ పురుషుడు - దానం కొద్దీ బిడ్డలు
దశ దానాలకూ తోటకూర కట్టే
దశ వస్తే దిశ కుదురుతుంది
దాగబోయి తలారి యింట్లో దూరినట్లు
దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లు
దానం చేయని చెయ్యీ - కాయలు కాయని చెట్టూ ఒక్కటే
దానాలలోకెల్లా విద్యాదానం శ్రేష్ఠం
దాయాది వుంటే నిప్పెందుకు?
దారం లేని సూదిని దయ్య మెత్తుకుపోతుంది
దారిన దొరికింది ధర్మానికి పోయింది
దారినపోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లు
దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేసినట్లు
దాలి గుంటలో కుక్క మాదిరి
దాసరిపాట్లు దైవాని కెరుక
దాసుని తప్పు దండంతో సరి
దింపుడు కళ్ళాశ
దిక్కు లేని యిల్లు దయ్యాల నిలయం
దిక్కు లేని వారికి దేవుడే దిక్కు
దిగంబర సన్న్యాసికి చాకలెందుకు?
దిగితే గానీ లోతు తెలియదు
దిన దిన దండం నూరేళ్ళాయుష్షు
దినబత్తెం దివిటీ వెలగు
దినమూ చచ్చేవాడికి ఏడ్చే దెవరు?
దివిటీ ముందు దీపం పెట్టినట్లు
దీపం ఆరిన తర్వాత దినుసంతా ఒక్కటే
దీపం ఉండగానే యిల్లు చక్కబెట్టుకోవాలి
దీపం పేరు చెబితే చీకటి పోతుందా?
దీపం ముడ్డి క్రిందనే చీకటి
దీపావళికి దీపమంత చలి
దీపావళికి వర్షాలు ద్వీపాంతరాలు దాటుతాయి
దుంగ దించి బండ నెత్తుకొన్నట్లు
దుక్కి వుంటే దిక్కు వుంటుంది
దుక్కికాని చేను తాలింపులేని కూర
దుక్కికొద్దీ పంట - బుద్ధి కొద్దీ సుఖం
దుక్కి చాలని చేనుకు ఎరువు ఎంత పెట్టినా వట్టిదే
దుక్కిటెద్దు చావు పక్కలో పెళ్ళాం చావు వంటిది
దుక్కి దున్నితేనే భూమికి శాంతం
దుత్తకు పాల రుచి తెలుసా?
దున్నకుండా చల్లితే కొయ్యకుండా పండినట్లు
దున్నగలిగేవాడికే ధరణి దీవెన
దున్న గలిగితేనే మన్ను ముట్టుకోవాలి
దున్నటం ఎవడైనా దున్నుతాడు - పంట పండించేవాడే కావాలి నాకు అందిట
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లు
దున్నపోతు మీద వాన కురిసినట్లు
దున్నబోతే దూడల్లోనూ మేయబోతే ఎడ్లలోనూ
దున్నుతూ వుంటే నాగళ్ళు - పారుతూ వుంటే నీళ్ళు
దున్నే ఎద్దునే పొడిచేది
దున్నేవాడు లెక్కలేసుకుంటే నాగలికూడా మిగలదు
దున్నేవానికి దడవనా తొక్కేవానికి వెరవనా అన్నదట
దుర్మార్గానికి తండ్రి బద్ధకం
దుష్టులకు దూరంగా ఉండాలి
దూకు దూకుమనే వాళ్ళేగానీ, దూకే వాడు ఒక్కడూ లేడు
దూబర తిండికి తూమెడు
దూరపు కొండలు నునుపు
దూస్తే దోసెడు - ఊదితే హుళక్కి
దెబ్బకి దెయ్యం వదులుతుంది
దెబ్బకొడితే దేవేంద్రలోకం కనబడాలి
దేవతలకు దుమ్ము - రాక్షసులకు మన్ను
దేవర చిత్తం - దాసుడి భాగ్యం
దేవర తలిస్తే దెబ్బలకు కొదువా?
దేవుడని మ్రొక్కితే దయ్యమై పట్టినట్లు
దేవునికి చూపులు - మనకి మేపులు
దేవునికి ముడుపు - దయ్యానికి దెబ్బ
దేవుడి పెండ్లి కందరూ పెద్దలే
దేవుడు తలిస్తే సంపదలకు కొదవా?
దేవుడు వరమిచ్చినా, పూజారి వరమీయడన్నట్లు
దేహి అంటే నాస్తి అనరాదు
దైవబలం మహాబలం
దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు
దొంగండీ అంటే ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నాడట
దొంగకు తేలు కుట్టినట్లు
దొంగకు తోడు - దొరకు సాక్షి
దొంగకు తోడు దొంగ
దొంగకు దొంగ సహవాసం
దొంగకు దొంగబుద్ధి - దొరకు దొరబుద్ధి
దొంగకు దొరికిందే చాలు
దొంగకు భయము - లంజకు సిగ్గు లేవు
దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు
దొంగ చేతికి తాళ మిచ్చినట్లు
దొంగతనానికి పోతూ డోలు చంకన పెట్టుకుని పోయినట్లు
దొంగను దోస్తే దాదూ లేదు - ఫిర్యాదూ లేదు
దొంగపోటు కంటే లింగ పోటెక్కువయిందిట
దొంగ పోయి తలారింట దూరినట్లు
దొంగల సొమ్ము దొరలపాలు
దొంగల సొమ్ము పరులపాలు
దొంగలందరూ దుష్టులు కారు - దుష్టులందరూ దొంగలే
దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు
దొంగలూ దొంగలూ కలిసి వూళ్ళు పంచుకున్నట్లు
దొంగవాడి దృష్టి మూటమీదనే
దొంగాడి పెళ్ళాం ఏనాటికైనా ముండమోపే
దొంగవాని తల్లికి ఏడువ భయం
దొంగిలించపోతే మంగలం దొరికిందట
దొందూ దొందే
దొడ్డివాకిట దయ్యాన్ని తరిమితే, తలవాకిట వచ్చి నిల్చిందట
దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకుపోతే గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి
దొరకని పూలు దేవునికర్పణం
దొరల చిత్తం - చెట్టు నీడ నిలకడ లేనివి
దొరికితే దొంగ - దొరకకపోతే దొర
దొరబిడ్డ అయినా ఒకనికి పెండ్లామే
దోచుకుపోయినవాడు దొర - దొరికినవాడు దొంగ
దోసకాయ తిన్న కడుపూ, దొంగలు దోచిన యిల్లూ ఒక్కటే
దోసెడు కాంతులు - వెన్నెల వూసులు
దౌర్భాగ్యపు దామోదరుడు
ద్రవిడ ప్రాణాయామంలాగా
ధనమొస్తే దాచుకోవాలి - రోగమొస్తే అమ్ముకోవాలి
ధనియాల జాతి వాళ్ళలాగా
ధరకు దొర ఎవడు?
ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ
ధరణికి గిరి భారమా?
ధరించే ఎరువున్నా భరించే పొరుగులేదు
ధర్మానికి చీర యిస్తే, యింటికి వెనక్కి వెళ్ళి మూర వేసిందట
ధర్మానికిపోతే కర్మం చుట్టుకొన్నట్లు
ధర్మో రక్షతి రక్షితః
ధాష్టీకపు ముష్టి
ధాష్టీకానికి ధర్మం లేదు
ధీరుడైనా కావాలి దీనుడైనా కావాలి
ధూపం వేస్తే పాపం పోతుందా?
ధైర్యం లేని రాజు - తెలివి లేని మంత్రి
ధైర్యే సాహసే లక్ష్మీ
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )