భాష సామెతలు
జగడమెట్లా వస్తుంది లింగయ్యా, అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా! అన్నాడట
జంగాలో! దాసర్లో! ముందూరును బట్టి
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మెందుకు?
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
జనవాక్యం కర్తవ్యం
జనవాక్యం గీటురాయి
జన్మకొక శివరాత్రి అన్నట్లు
జబ్బొకటి - మందొకటి
జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
జయాపజయాలు ఒకరి సొమ్ముగావు
జరిగితే జల్లెడతో మోయవచ్చు
జరిగితే జ్వరమంత సుఖం లేదు
జరుగుబాటు తక్కువ - అదిరిపాటెక్కువ
జలగ పట్టినట్లు
జ్వర జిహ్వకు పంచదార చేదు
జాతి కొద్దీ బుద్ధి - కులం కొద్దీ ఆచారం
జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు
జారితేనూ, సాగితేనూ పడమన్నారు
జానెడు పిట్టకు మూరెడు తోక
జ్ఞాతి గుఱ్ఱు - అరటి కఱ్ఱు వదలవు
జింకకు కొమ్ములు బరువా?
జిల్లేడు పువ్వుకు తుమ్మెద లాశించినట్లు
జివ తక్కువ - జీత మెక్కువ
జిహ్వకొక రుచి - పుఱ్ఱెకొక బుద్ధి
జీతం బత్తెం లేకుండా తోడేలు గొర్రెలు కాస్తానందట
జీతం లేని నౌకరు, కోపం లేని దొర లేరు
జీలకర్ర - శింగినాదం
జీలకర్రలో కర్రాలేదు - నేతిబీరలో నెయ్యీ లేదు
జుట్టుంటే ఎన్ని కొప్పులైనా పెట్టొచ్చు
జుట్టున్నమ్మ ఏకొప్పు అయినా పెడుతుంది
జెముడు కంచెకు శ్రేష్ఠం - రేగడి చేనుకు శ్రేష్ఠం
జ్యేష్ఠ చెడకురియును - మూల మురుగ కురియును
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు
జోడు లేని బ్రతుకు తాడు లేని బొంగరం
జోరీగల గొడ్డుకు గోరోజనం మెండు
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )