భాష సామెతలు
మంగలంలోని పేలాల్లాగా
మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు
మంగలి పనిలాగా
మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే
మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే
మంచం మీద వున్నంతసేపే మగడు - కిందికి దిగితే యముడు
మంచం వేసేంతవరకే ఇద్దరం - మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందట
మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందట
మంచమెక్కిన తర్వాత విందు లేదన్నట్లు
మంచమెక్కిన మీదట మర్యాదలేల?
మంచమెక్కి వావి వరుస లడిగినట్లు
మంచికి పోతే చెడు ఎదురైనట్లు
మంచాల తమకాలకు ఒయ్యారాల నజరానాలన్నట్లు
మంచి ఆలి కొక మాట - మంచి ఎద్దు కొక వాత
మంచి కొంచమైనా చాలు
మంచి గొడ్డుకొక దెబ్బ - మంచి మనిషికొక మాట
మంచి చెడ్డలు పడుగు పేకలు
మంచి మరణంలో తెలుస్తుంది
మంచి మాటకు మంది అంతా మనవాళ్ళు
మంచివాడు మంచివాడు అంటే యిల్లంతా నాశనం చేశాడట
మంచివాడికి మాటే దెబ్బ
మంత్రం లేని తీర్థం మరి బక్కెడు
మంత్రం లేని సంధ్యకు మరి చెంబుడు నీళ్ళు
మంత్రంలో పస లేకపోయినా తుంపర్లకు కొదవలేదు
మంత్రసాని పనికి ఒప్పుకొన్నాక ఏది వచ్చినా పట్టాలి
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
మందికి నీతి చెప్పాను కానీ - నీకూ నాకూ కాదు అన్నాడట
మందిని మ్రింగే యిల్లుండాలి గానీ - ఇంటిని మ్రింగే మంది ఉండరాదు
మందిని ముంచి గుడి కట్టినట్లు
మంది ఎక్కువయితే మజ్జిగ పలచన
మందుకు పథ్యం - మాటకు సత్యం
మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు
మందూ, మాకూ లేదన్నట్లు
మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు
మగడు విడిచిన ముండ - మబ్బు విడిచిన ఎండ
మగని చుట్టాలు చెప్పులు ముంగిట్లో విడిస్తే - ఆలి చుట్టాలు వంటింట్లో విడుస్తారు
మగనికి మాడు చెక్కలు - మిండడికి పంచభోజ్యాలు
మగువే మగవాడికి మధుర భావన
మఘ ఉరిమితే మదురు మీద కర్ర అయినా పండుతుంది
మఘ, పుబ్బలు వరుసయితే క్షామం
మఘలో మానెడు - పుబ్బలో పుట్టెడు
మట్టిపనికైనా స్వంతవాడే కావాలి
మట్టిలో మాణిక్యంలాగా
మట్టెల చప్పుడే కానీ చేసే పనేమీ లేదు
మడికి గట్టు, యింటికి గుట్టు, మాటకు మంచి కావాలి
మడి బీదకాదు - రైతే బీద
మతి ఎంతో గతి అంత
మతిలేనమ్మకు గతి లేని మగడు
మతిలేని మాటకు శృతిలేని పాట
మదిలో ఒకటి - మాటలో ఒకటి
మద్దెల పోయి రోలుతో మొర పెట్టుకున్నట్లు
మన బంగారం మంచిదయితే కంసాలిని వన్నె అడగడం దేనికి?
మన్మథ రాజ్యంలో ముద్దుల మద్దెల మోతలే వుంటాయన్నట్లు
మనసుకు మనసే సాక్షి
మనసున నాటిన మాటలు చెరుపలేరు
మనసు విరిగితే అతుక్కోదు
మనసుంటే మార్గముంటుంది
మనసు కుదిరితే మల్లి - కుదరకుంటే ఎల్లి
మనసుకు ముఖమే సాక్షి
మనసు మంచిదే - గుణమే గుడిసేటిది
మనసు మనువు కేడిస్తే - వీపు దెబ్బల కేడ్చిందట
మనసు మహామేరువు రాటుతుంది - కాలు కందకం దాటదు
మనసు లేని మనువులాగా
మనసులో ఏముంటే సోదిలో అదే వస్తుంది
మనసులో చింతకు మందులేదు
మనసైన అమ్మాయి నవ్వు మన్మథుని శరమైన పువ్వన్నట్లు
మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు
మనిషి కాటుకు మందు లేదు
మనిషికి ఉన్నది పుష్టి - గొడ్డుకు తిన్నది పుష్టి
మనిషికి ఒక మాట - గొడ్డుకు ఒక దెబ్బ
మనిషికి కాక మానులకు వస్తాయా కష్టాలు?
మనిషికి మాటే అలంకారం
మనిషికొక తెగులు మహిలో వేమా
మనిషి చస్తే మాట మిగులుతుంది
మనిషి పేదయితే మాటకు పేదా?
మనిషి సంగతి మాట చెపుతుంది
మనీకి ముందు - పనికి వెనుక అన్నట్లు
మనుగుడుపుల అల్లుడూ - చెరకు తోటలో ఏనుగూ ఒక్కటే
మనువాడిన తర్వాతే అందాల విందులు అందిట
మనువొక చోట - మనసొక చోట
మనుషులు పోయినా మాటలు వుంటాయి
మనోవ్యాధికి మందు లేదు
మన్ను తిన్న పామువలె
మన్ను పడితే బంగారం - బంగారం పడితే మన్ను
మబ్బులో పొద్దు
మర్దనం గుణవర్ధనం
మరదలి సరసం మొగలి పువ్వుల వాసన వంటిది
మరుని విందుకు పరదా లెందుకు?
మరులున్నవాడే మగడు
మర్యాదకు పోతే మానం దక్కదు
మర్రి చెట్టుక్రింద మొక్కలు కావు
మరో లోకానికి వెళ్ళినా మారుటి తల్లి వద్దు
మలప బుద్ధులు - పిదప చేష్టలు
మలప సన్యాసి వేషాలు వేసినట్లు
మలుగులు క్రుంగితే మాపటికి ఈనుతుంది
మల్లెల జ్వరానికి అందాల గంధమే మందు అన్నట్లు
మల్లెల మంచం మీదే మన్మథ లంచం అన్నదట
మల్లెల వేళలో వయసు సొగసుల విందు లన్నట్లు
మసి పాత్రలో మాణిక్యంలాగా
మసి పూసి మారేడు కాయ చేసినట్లు
మసి మొగంగాడూ, చమురు కాళ్ళవాడూ జతకలిసినట్లు
మహాజనానికి మరదలు పిల్లన్నట్లు
మహారాజని మనవి చేసుకుంటే, మరి రెండు తగిలించమన్నాడట
మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి
మహాభారతంలో ఆదిపర్వ మన్నట్లు
మహా వ్యసనాలుంటే గానీ మహాత్ములు కాలేదన్నట్లు
మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా?
మాంసం తినేవాడు పోతే ఎముకలు కొరికే వాడు వస్తాడు
మా ఆయనే ఉంటే మంగలి వాణ్ణయినా పిలుచుకొని వచ్చేవాడు అన్నదట
మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌? మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌?
మాకు జయం - మీకు ఋణం
మా గేదె చస్తే చచ్చిందిగానీ ఎదురింటి గేదె పాలివ్వకపోతే చాలు
మాఘమాసపు చలి మంటలో పడ్డా తీరదు
మాఘమాసపు వాన మగడు లేని జాణ
మాఘమాసపు చలికి చెట్లుకూడా వణుకుతాయి
మాచకమ్మ సౌందర్యంలాగా
మాటకారి - నీటుగాడు
మాటకు ప్రాణంగానీ మూటకు ప్రాణమా?
మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు
మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి
మాటకు ముందు ఏడ్చేవాడిని - నవ్వే ఆడదానిని నమ్మరాదు
మాటకు హరిశ్చంద్రుడి లాగా
మాట గొప్ప చెప్ప మాటలు చాలవు
మాట చుట్టమా? పెట్టు చుట్టమా?
మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే
మాట మంచి - చేత చెడ్డ
మాట మీకు - మూట మాకు
మాటలతో మూటలూ, మాన్యాలు సంపాదించవచ్చు
మాటల పసేగానీ చేతల పస లేదు
మాటలు కోటలు దాటుతాయ్‌ కాళ్ళు గడప దాటవు
మాటలు చెప్పే మొనగాళ్లేగానీ బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు
మాటలు తల్లి మాటలు - పెట్టు సవతి తల్లి పెట్టు
మాటలు, పాటలు మాయింట్లో, మాపటి భోజనం మీ యింట్లో
మాటలు నేర్చిన కుక్కల్ని వేటకు తీసుకెళితే యిస్కో అంటే యిస్కో అన్నాయట
మాటలు నేర్చినమ్మ ఏడ్చినా అందమే
మాట లేకుంటే చోటే లేదు
మాటలే మంత్రాలు - మాకులే మందులు
మాటల్లోపడి మగణ్ణి మరచినట్లు
మాటల్లో మరులు - చేతల్లో స్వర్గాలు
మాట్లాడితే మల్లెలు - కాట్లాడితే కందిరీగలు
మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు
మాదిగవాని ఆలయినా మాడే కాలికి చెప్పుండదు
మానం చూపి ప్రాణం తీసినట్లు
మానంతో మనీ - మనీతో జల్సా అన్నట్లు
మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు?
మానవ సేవే మాధవ సేవ
మానిందే మందు - బ్రతికిందే బ్రతుకు
మానిన పుండును రేపినట్లు
మాపటికి మనసు - రేపటికి సొగసు అన్నట్లు
మాపటేళ ఆకలి, పెదవుల దాహం తీరవన్నట్లు
మామ బంతిన కూర్చుని అత్త బంతిన లేచినట్లు
మామా ఒకింటి అల్లుడే
మామిళ్ళకు మంచు చెరుపు - కొబ్బరికి కుడితి చెరుపు
మారులేని తిండి మాలతిండి
మార్గశిరలో మాట్లాడటానికి ప్రొద్దుండదు
మాలకూటికి పోయినా పప్పు నీళ్ళే
మాల పల్లెలో మంగళాష్టకాలు
మాల బడాయి పాటి మీద - మొగుడి బడాయి ఆలి మీద
మావి మాకిస్తే రాజ్యమిచ్చినట్లే
మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనెట
మింగ మెతుకులేదు, లంజకు లత్తుకట
మింటికీ, మంటికీ ముడి వేసినట్లు
మిండలను మరిగినమ్మా, మీగడ తిన్నమ్మా ఊరుకోరు
మిడతంభొట్ల జోస్యంలాగా
మితం తప్పితే హితం తప్పుతుంది
మిధునంలో పుట్టిన మొక్కా, మీసకట్టుతో పుట్టినకొడుకూ అక్కర కొస్తారు
మిన్ను విరిగి మీదపడ్డట్లు
మీ ఇంట్లో తిని మా యింట్లో చేయి కడుగమన్నట్లు
మీకు మాట నాకు మూట
మీద మెరుగులు - లోన పురుగులు
మీ వూరు మావూరి కెంత దూరమో, మా వూరూ మీ వూరి కంతే దూరం
మీన మేషాలు లెక్క పెట్టినట్లు
ముంజేతి కంకణానికి అద్దమేల?
ముండకు దొరికేది మోటు మొగుడే
ముండకు దొరికేవి మొండి శిశినాలే
ముండ మొయ్యవచ్చు గానీ నింద మొయ్యరాదు
ముండ మోసినట్లుగా
ముండా కాదు, ముత్తయిదువా కాదు
ముంతపాలు కుర్రాడికి - బంతులాట మంచానికి
ముందరికాళ్ళకు బంధాలు వేసినట్లు
ముందరున్నది ముసళ్ళ పండుగ
ముందు ఆకు తెచ్చుకుంటే ఎప్పుడైనా తినవచ్చు
ముందుకు పోతే మురికి ముండ - వెనుకకు పోతే వెర్రి ముండ
ముందు నుయ్యి - వెనుక గొయ్యి
ముందూ నడిచే ముతరాచువాణ్ణీ - వెనుకనడిచే ఏనాది వాడినీ నమ్మరాదు
ముందు పెళ్ళాం బిడ్డలు మెతుకులేక ఏడుస్తుంటే ఉంచుకున్నదానికి పిల్లలులేరని పూజలు చేసాట్ట
ముందు ముచ్చట్లు -వెనుక చప్పట్లు
ముందు మురవబోకురా ముతరాచు వాడా అన్నట్లు
ముందు మురిసినమ్మకు పండుగ గుర్తుండదు
ముందు మూడుముళ్ళ ముచ్చట - తర్వాత సోయగాల జాతర అందట
ముందు వచ్చిన చెవులకంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి
ముందు వాళ్ళకు మూకుళ్ళు - వెనుక వాళ్ళకు నాకుళ్ళు
ముక్కు ఉండేంత వరకే పడిశ ముంటుంది
ముక్కు ఏదంటే తల చుట్టూ త్రిప్పి చూపినట్లు
ముక్కు కోసినా మొదటి మొగడే మేలు
ముక్కు మూరెడు సిగ బారెడు
ముక్కు మూసుకుంటే మూడు ఘడియలు
ముక్కులో ఏ వేలు పెట్టినా సరిపోతుంది
ముక్కులో చీమిడుందంటే, నీ చేత్తోనే తీయమన్నట్లు
ముక్కూ మొహం తెలీనట్లు
ముఖం అందం మానానికి చేటు
ముఖం చూచి బొట్టు పెట్టినట్లు
ముఖంలో సుఖంలేదు - మోకాళ్ళలో బిగువు లేదు
ముఖారవిందం - భజగోవిందం
ముగ్గురికి తెలిస్తే మూడు లోకాలకు ప్రాకుతుంది
ముట్టుకుంటే ముత్యం - పట్టుకుంటే బంగారం
ముడ్డిక్రిందకు నీళ్ళు వస్తే కానీ లేవరు
ముడ్డి గిల్లి జోల పాట పాడినట్లు
ముడ్డి మీద తంతే మూతిపళ్లు రాలినట్లు
ముత్యపుచిప్పలన్నీ ఒక చోట - నత్తగుల్లలన్నీ ఒకచోట
ముత్యమంత పదునుంటే మూల కార్తెలో చల్లినా ఉలవచేను పండుతుంది
ముత్యాలు, పగడాలు, ముట్టుకుంటే జగడాలు
ముదిమిన ముచ్చట్లు లావు
ముద్దంటే ఒకింత మత్తు - ఒద్దంటే మరింత కోపం
ముద్ద ముద్దకీ బిస్మిల్లానా!
ముద్దుగుమ్మ కౌగిలింత నిద్రరాని ఆవులింత అన్నట్లు
ముద్దు చేసిన కుక్క మూతి నాకితే - రంకు నేర్చిన రమణి రచ్చ కీడ్చిందట
ముద్దున పేరు, మురిపాన నడక చెడతాయి
ముద్దూ, మురిపెం మావంతు - ముడ్డీ, దొడ్డీ మీవంతు
ముద్దూ మురిపాలు కౌగిళ్ళలోనే అన్నట్లు
మునగానాం తేలానాం మూసివాయనం అన్నట్లు
మునిగితే గుండు - తేలితే బెండు
మునిగే వాడికి తెలుసు నీటి లోతు
ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు
మురిపాలు, ముచ్చట్లు అంటే ముసుగు పెడతాడన్నట్లు
మురిపెం తిరిపెం చేటు - ముసలి మొగుడు మంచానికి చేటు
ముల్లు తీయాలంటే ముల్లే కావాలి
ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం
ముష్టికి నష్టి ఏమిటి?
ముష్టికి నష్టి వీరముష్టి
ముసలి కాలానికి ముప్పతిప్పలు
ముసలివానికి ముండ ముద్దు
ముసలి ముగ్గురిని మార్చినట్లు
ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాట
ముసుగులో గుద్దులాట
మూగవాని ముందు ముక్కు గోక్కున్నట్లు
మూట పోతే పోయింది మాట పోరాదు
మూడు కొప్పులు కూడితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయి
మూడు కొప్పులు ఏకమైతే ముల్లోకాలూ ఏకమౌతాయి
మూడు రోజులుంటే మురికి చుట్టం
మూడునాళ్ళ ముచ్చట
మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు
మూడు మాటలు - ఆరు తప్పులు
మూడొచ్చి ముందుకొస్తే మూడంకె వేసిందట
మూతి ముద్దుల కేడిస్తే వీపు గుద్దుల కేడుస్తుంది
మూడుముళ్ళ ముచ్చట
మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది
మూరెడు పొంగటం ఎందుకు? బారెడు క్రుంగటం ఎందుకు?
మూల కురిస్తే ముంగారు పారు
మూల ముంచు - జ్యేష్ఠ చెరచు
మూల వాన ముంచక మానదు
మూలవిరాట్లు ముష్టెత్తుకుంటూంటే ఉత్సవవిగ్రహాలకు ఊరేగింపట
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు
మూలుగులు మునుపటిలాగే - భోజనాలు ఎప్పటిలాగే
మూసివాయనం ముత్తయిదువులాగా
మూసిన ముత్యం - పాసిన పగడం
మూసి పెడితే పాచిపోయిందట
ముళ్ళు వేయటం చేతగాదుగానీ కోక ముడి విప్పనా అంటాడట పాపం!
మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడతాయి
మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది
మృగశిరలో ముల్లోకాలు చల్లబడతాయి
మృగశిరలో వేసిన పైరు, మీసాలు రావడంతో పుట్టిన కొడుకు మేలు
మృగశిర కురిస్తే మఖ గర్జిస్తుంది
మెచ్చి మేకతోలు కప్పినట్లు
మెడబట్టి నెడితే చూరుపట్టుకుని వ్రేలాడినట్లు
మెడలో రుద్రాక్షలు - మదిలో మదిరాక్షులు
మెతుకవుతే బ్రతుకవుతుంది
మెత్తగా వుంటే మొత్తబుద్ధి వేస్తుంది
మెత్తనివాళ్లను చూస్తే మొత్తబుద్ధి వేసినట్లు
మెరుపు దీపం కాదు - మబ్బు గొడుగు కాదు
మేకకు తెలిసిందంతా మేత సంగతే
మేకపోతు గాంభీర్యంలాగా
మేక వన్నె పులి
మేతకన్నా మసలితేనే బలం
మేత కరణంగానీ కూత కరణం కాదు
మేతకేగాని చేతకు కొరగాడు
మేనత్త పోలిక - మేనమామ చాలిక
మేయబోతే ఎద్దుల్లోకి దున్నపోతే దూడల్లోకి
మేలు మరువరాదు - కీడు పలుకరాదు
మేసేగాడిదను కూసేగాడిద వచ్చి చెరచినట్లు
మొండికి సిగ్గులేదు - మొరడుకు గాలి లేదు
మొండికీ, బండకూ నూరేళ్లాయుష్షు
మొండి గురువు - బండ శిష్యుడు
మొండిచేత్తో మూర వేసినట్లు
మొండిచేతి వానికి నువ్వులు తినటం నేర్పినట్లు
మొండివాడు రాజుకంటే బలవంతుడు
మొక్కబోయిన దేవర ఎదురైనట్లు
మొక్కై వంగనిది మానై వంగుతుందా?
మొగబుద్ధి మోటబుద్ధి - ఆడబుద్ధి అపర బుద్ధి
మొగమాటానికి పోతే కడుపైనట్లు
మొగుడికి దిండు - వుంచుకున్న వాడికి దేహం
మొగుడికి మొద్దులు - మిండడికి ముద్దులు
మొగుడికే మగతనం ఉంటే పొరుగింటాయనతో పనేంటి? అందిట
మొగుడి కౌగిలి మొగలి పరిమళం
మొగుడితో పెళ్ళికీ, పిల్లలతో తీర్థానికీ వెళ్ళరాదు
మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లు
మొగుడిని కొట్టి మొరపెట్టుకున్నట్లు
మొగుడిమీద కోపం ప్రొద్దుగూకేంత వరకే
మొగుడివాసన వచ్చేంతవరకూ ముసలివాసన తప్పదు
మొగుడు కొట్టినందుకు కాదుగానీ తోటికోడలు/ప్రక్కవాళ్ళు నవ్వినందు కేడ్చిందట
మొగుడు కొద్దీ వన్నెలు - సిరి కొద్దీ చిన్నెలు
మొగుడు లేనిదానికి మంత్రసానెందుకు?
మొగుడే ముండా అంటే ముష్టికి వచ్చినవాడూ ముండా అంటాడు
మొదటికే మోసమయితే, లాభాలకు గుద్దులాటా?
మొదటి దానికి మొగుడులేడు - కడదానికి శోభనమట
మొదటి ముద్దుకే మూతి పళ్ళు రాలినట్లు
మొదటే కోతి, పైగా కల్లు తాగింది, ఆపై నిప్పులు త్రొక్కింది
మొద్దు మొహానికి అలంకరణ గూడానా?
మొరిగే కుక్క కరవదు
మొలది విప్పి తలకి చుట్టుకొన్నట్లు
మోచేతి దెబ్బ - మొగుడి కాపురం ఒకటి
మోటువాడికి మొగలిపువ్విస్తే మడిచి ముడ్డిలో పెట్టుకున్నాడట
మోసేవాడికి తెలుస్తుంది బరువు
మోహం లేకపోతే మోదం లేదు
మౌనం అర్ధాంగీకారం
మౌనేన కలహం నాస్తి
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )