భాష సామెతలు
పంచదార పలుకులు - విషపు చూపులు
పంచపాండవులంటే నాకు తెలీదా? మంచపుకోళ్ళులాగా ముగ్గురంటూ రెండువేళ్ళు చూపించాడట
పంచాంగం పటపట - విస్తరాకు లొటలొట
పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా?
పంచాగ్ని మధ్య ఉన్నట్లు
పంటకు పెంట - వంట మంట
పండని ఏడు పాటు ఎక్కువ
పండాకును చూచి పసరాకు నవ్వినట్లు
పండాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుంది
పండిత పుత్రుడు పరమ శుంఠ
పండిన రోజే పండుగ
పండినా ఎండినా పని తప్పదు
పండుగనాడూ పాత పెళ్ళామేనా/పాత మొగుడేనా?
పండుగ - పైన దండుగ
పండు వలిచి చేతిలో పెట్టినట్లు
పండే పంట పైరులోనే తెలుస్తుంది
పంది ఎంత బలిసినా నంది కాదు
పందిని పొడిచే వాడే బంటు
పంది పన్నీరు మెచ్చునా?
పంది బురద మెచ్చు
పందిరి పడి బ్రతికినవారూ యిల్లు పడి చచ్చినవారూ లేరు
పందుం తిన్నా పరకడుపే
పంపకాలు మాకు - లొట్టలు మీకు
పకపకా నవ్వేవారూ, గబగబా అరిచేవారూ కపటమెరుగరు
పక్కమీద పూలు నలిగినట్లు నీవూ నలిగితే ఎట్లా అన్నాడట
పక్కలో బల్లెంలాగా
పక్కింటి పోరు పండగంత వేడుక
పగ గలిగి బ్రతకటం - పామున్న యింట్లో బ్రతకటం ఒక్కటే
పగటి నిద్ర పనికి చేటు
పగ బట్టిన త్రాచులాగ
పగలు చెయ్యి లాగితే రానిది, రాత్రి కన్నుగీటితే వస్తుందా?
పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తుంది అన్నట్లు
పగలూ, వగలూ నిప్పులాంటివి
పగలెల్లా బారెడు నేశాను - దీపం తేరా దిగనేస్తాను అన్నాడట
పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడట
పచ్చగా వుంటే పదిమంది చుట్టాలు
పచ్చి వెలగకాయ గొంతుకడ్డం పడ్డట్లు
పట్టణే పాదమాచారం
పట్టినదంతా బంగారం - ముట్టినవల్లా ముత్యాలు అన్నట్లు
పట్టుకొన్నవాడు మట్టగుడిశ అంటే పైనున్నవాడు జెల్ల అన్నాడట
పట్టుకొమ్మను నరుక్కున్నట్లు
పట్టుచీర ఎరువిచ్చి, పీట పట్టుకుని వెంట తిరిగినట్లు
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు
పట్టెడు పెడితే పుట్టెడు పుడుతుంది
పట్టెడు బొట్టుంటే పది లక్షలు స్త్రీకి
పడతి పరువాలు పంచదార గుళికలు
పడమట కొర్రువేస్తే పందిళ్ళమీద రాజనాలు పండుతాయి
పడమట కొర్రువేస్తే పాడి ఆవు రంకె వేస్తుంది
పడమట పిసరంత మబ్బు నడిస్తే పాతాళందాకా వాన
పడమట మెరిసిన పది ఘడియలకు వాన
పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళలో దిగదు
పడ్డ గోడలు పడ్డట్టుండవు - చెడిన కాపురం చెడినట్లుండదు
పడిసం పదిరోగాల పెట్టు
పడుగూ పేకలాగా
పడుచుపిల్ల పరువాలు రసరాజ్య సోపానాలు
పడుచుపిల్ల కనుగీటు యువహృదయపు తడబాటు
పడుచుపిల్ల కౌగిలి సుఖాల లోగిలి
పడుచుల కాపురం - చితుకుల మంట
పడుచులతో సయ్యాట - పాములతో చెలగాటం ఒకటే
పడ్డవారు చెడ్డవారు కారు
పణత పడే జాగాకే కాళ్ళు ఈడ్చుకుపోతాయి
పత్రి దేవుని మీద - భక్తి చెప్పులమీద
పదవులు మావి - బాధలు మీవి
పదిమంది చేరితే పనిపాడు
పదిమంది నడిచిందే బాట
పదిమంది కళ్ళ పడ్డ పాము చావక బ్రతుకుతుందా?
పది రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగులుతుంది
పది వూళ్ళ పాపరాజులాగా
పదుగురాడుమాట పాటియై ధర చెల్లు
పద్మాసనం వేసుకుని కూర్చుంటే పరమాన్నం వడ్డిస్తారా?
పనికి పంగనామం పెట్టి గంపజాతర నెత్తికెత్తుకున్నట్లు
పనికి పరాకు - తిండికి హుషారు
పనికి పాతిక నష్టం - పరక లాభం
పనికి పీనుగ - తిండికి ఏనుగు
పనికి వచ్చి సరదా తీర్చమన్నట్లు
పనిగలవాడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందట
పనిచేయనివాడు ఇంటికి చేటు
పని తక్కువ - ప్రాకులాట ఎక్కువ
పనిముందా? తిండి ముందా?
పని ముద్దా? పాటు ముద్దా?
పని లేని పాపరాజులాగా
పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్లు
పనీ పాటూలేదు పదం పాడతానన్నట్లు
పనీలేదు - పాటూలేదు
పన్నెండామడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నాడట
పప్పుకూటికి ముందు - చాకిరీకి వెనుక వుండాలి
పప్పులేని పెళ్ళి - ఉప్పులేని కూర
పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పెయ్యవే కోడలా అంటే,
పప్పులో చెప్పువేసి, అత్త కంచంలో అంచున పెట్టిందట
పయోముఖ విషకుంభము
పరకాంత పొందు తాచుపాము పడగ
పరకాంత లెందరయినా కులకాంతకు సాటిరారు
పరనింద గృహక్షయం - యతినింద కులక్షయం
పరమానందయ్యగారి శిష్యులలాగా
పరికిణీ, పావడాలు పరువాల ఆవడలు
పరుగెత్తి పాలు త్రాగేకన్నా, నిలబడి నీళ్ళు త్రాగటం మేలు
పరులసొమ్ము పాపిష్టిది
పరుల సొమ్ము పామువంటిది
పరుల సొమ్ము పేలపిండి
పరువాల జాతరలో పెదవి ఎంగిలా?
పరువాల పల్లవింత - పాన్పు త్రుళ్ళింత
పరువాల పొందుకు పరదాలు అడ్డెందుకు?
పరువాల పోరు మధువుల పుంత అన్నట్లు
పరువిచ్చి పరువు తెచ్చుకో
పరువుకీ, కరువుకీ డబ్బు
పరువు లేని బ్రతుకు పరమ రోత
పరోపకారం ఇదం శరీరం
పళ్ళూడకొట్టుకోవటానికి ఏ రాయైనా ఒక్కటే
పశువుల పాలు మేపును బట్టి
పశువుల విరివి - పంటకు తేట
పసిపిల్లలు దేవుడితో సమానం
పసిపిల్లలు, తాగుబోతులు నిజం చెబుతారు
పసుపు, కుంకుమల కోసం పది క్రోసులయినా వెళ్ళాలి
పెళ్ళికి బొట్టుపెట్టి పిలిస్తే వెళ్ళక, పెంకుపట్టుకుని వెనుకదారిన పులుసు కోసం వెళ్ళిందట
పాండవుల సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరి
పాచిన కూరలు బాపనికన్నట్లు
పాచిపండ్లవాడు కూడబెడితే, బంగారు పండ్లవాడు అనుభవించాడట
పాటకు పది ఫణుతులు
పాటిమీద గంగానమ్మకు కూటిమీదే ధ్యాస
పాటుకలిగితే కూటికి కొదువా?
పాటు చేతకానివాడు మాటల మోసగాడు
పాటు పడితేనే భాగ్యం
పాటులెల్ల పొట్టకూటికే
పాడిందే పాడరా పాచిపండ్ల దాసరీ! అన్నట్లు
పాడికి పంట తమ్ముడు
పాడికుండలు పగులకొట్టినట్లు
పాడి గుట్టు - పంట రట్టు
పాడిని దాచాలి - పంటను పొగడాలి
పాడి పసరము, పసిబిడ్డ ఒకటే
పాడువూరికి నక్క తలారి
పాడే నోటికి పాట పండుగ
పాత చింతకాయ పచ్చడి
పాత చుట్టం - పాత చింతకాయపచ్చడి
పాతది పనికి రాదు - కొత్తది కొరగాదు
పాత రోత - కొత్త రుచి
పాత్ర యెరిగి దానం యివ్వాలి - వంశ మెరిగి బిడ్డను తెచ్చుకోవాలి
పానకంలో పుడకలాగా
పానుపు అలవాలిగానీ తనువులు గాదన్నట్లు
పాపమని పాలు పోస్తే, ఒద్దని ఒలకపోశాడట
పాపమని భోజనం పెడితే పక్కలోకి రమ్మన్నాడట
పాపాల భైరవుడు
పాపిట వంకరయితే బ్రతుకంత వంకరే
పాపి సముద్రానికి పోతే అరికాలు తేమ కాలేదుట
పాపిసొమ్ము పరులపాలు - ద్రోహిసొమ్ము దొంగలపాలు
పాపీ చిరాయువు
పాముకాళ్ళు పాముకే ఎరుక
పాముకు పళ్ళలో విషం - జ్ఞాతికి కండ్లలో విషం
పాముకు పాలు పోసినట్లు
పాము చావరాదు - బడిత విరగరాదు
పాము చుట్టము - పడగ పగ
పాము పడగ నీడను కప్ప చందాన
పారే ఏటికి నీరు పండుగ
పాలకొండ లోయల్లో బంతులాట అన్నట్లు
పాలకోసం పొదుగు కోసినట్లు
పాల పొంగు - పడుచు పొంగు
పాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు
పాలు పొంగటం పొయ్యిపాలుకే
పిండార బోసినట్లు వెన్నెల
పిండికొద్దీ రొట్టె - తిండికొద్దీ పసరం
పిండి బొమ్మ చేసి ఆడబిడ్డంటే, ఆడబిడ్డ తనాన అదిరదిరి పడిందిట
పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది
పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట
పిచ్చి కుదిరితే గానీ పెళ్ళికాదు - పెళ్ళి అయితే గానీ పిచ్చి కుదరదు
పిచ్చివాని చేతిలో రాయిలాగా
పిచ్చివాడికి లోకమంతా పిచ్చే
పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం
పిట్టకు పట్టేదెంత?
పిట్టకొంచెము - కూత ఘనము
పిట్టపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చినట్లు
పిడుగుకు గొడుగడ్డమా?
పిడుగుకూ, బియ్యానికి ఒకే మంత్రమా?
పిత్త సత్తువ లేదు గానీ పాసనాలకు మందట
పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు
పిత్తి నేల గోకినట్లు
పిత్తిన ముత్తయిదువవలె
పిదప కాలానికి పిదప బుద్ధులు
పిరికివానికే పిడికెడంత మీసాలు
పిరికివాని బింకంలాగా
పిర్రలు చూసి పీట వేసినట్లు
పిలవని పేరంటానికి వెళ్ళినట్లు
పిలిచి పిల్లనిస్తానంటే వంక పెట్టినట్లు
పిలిచేవారుంటే బిగిసేవారికి కొదువలేదు
పిల్ల ఓపిక శోభనంలో తెలుస్తుందన్నట్లు
పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ!
పిల్లకాయ - పిల్లకాకి
పిల్ల గలవాడు పిల్లకేడిస్తే - కాటివాడు కాసుకేడ్చినట్లు
పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదు
పిల్లనిచ్చినవాడు ఈగ - పుచ్చుకున్నవాడు పులి
పిల్ల పిడికెడు - గూనె గంపెడు
పిల్ల ముద్దుగానీ పియ్య ముద్దా!
పిల్లా అని పిలిస్తే పెళ్ళి చేసుకుంటావా అని అడిగిందట
పిల్లి ఎదురైతె తల్లి గూడా శత్రువవుతుంది
పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట
పిల్లికి ఎలుక సాక్షి
పిల్లికి కూడా భిక్షం పెట్టనట్లు
పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణసంకటం
పిల్లికి రొయ్యల మొలత్రాడు కట్టినట్లు
పిల్లి గ్రుడ్డిదయితే ఎలుక ముడ్డి చూపిస్తుంది
పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్లు
పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదు
పిల్లి పిల్లలను త్రిప్పినట్లు
పిల్లిమెడలో గంట కట్టేదెవరు?
పీటకు పిఱ్ఱకు వైరం
పీట పగిలేటట్లు తిన్నట్లు
పీనుగుమీద పిండాకూడు
పుండుకు పుల్ల మొగుడు
పుండున్నచోటే పుల్ల తగుల్తుంది
పుండు మానినా మచ్చమానదు
పుండుమీద కారం చల్లినట్లు
పుక్కిట పురాణం
పుచ్చుకున్నప్పుడు కొడుకుపుట్టినంత సంతోషం, యిచ్చేటప్పుడు మనిషిపోయినంత బాధ
పుట్టంగ పురుడు - పెరగంగ పెళ్ళి
పుట్టనివాడు, గిట్టినవాడు పుణ్యాత్ములు
పుట్టమన్ను వేస్తే పుట్లకొద్దీ పంట
పుట్టమీద తేలుకుడితే నాగుపాము కరచినట్లే
పుట్టి చచ్చినా కొడుకే మేలు
పుట్టినవాడు గిట్టక మానడు
పుట్టి మునిగినట్లు
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు
పుట్టెడు అప్పులు
పుట్టెడు నువ్వుల్లోపడి దొర్లినా అంటేగింజే అంటుతుందిగానీ అంటనిది అంటదు
పుడుతూ పుత్రులు - పెరుగుతూ శత్రువులు
పుణ్యంకొద్దీ పురుషుడు - దానంకొద్దీ బిడ్డలు
పుణ్యంకొద్దీ పురుషుడు - విత్తంకొద్దీ వైభవం
పుణ్యం పుట్టెడు - పురుగులు తట్టెడు
పుణ్యానికి పిలిచి కొలిస్తే పిచ్చికుంచమని పారపోశాడట
పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్లు
పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా చెట్టు క్రింద గడ్డనానదు
పుబ్బ రేగినా బూతురేగినా నిలువవు
పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒక్కటే
పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు
పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
పురిటిలోనే సంధి కొట్టినట్టు
పురుషుల భాగ్యం - పడతుల సౌఖ్యం
పురుషులందు పుణ్య పురుషులు వేరయా!
పుర్రెకొక తెగులు
పుర్రెకొక బుద్ధి - జిహ్వకొక రుచి
పూచిన పువ్వంతా కాయలైతే చెట్టు మనునా?
పులి కడుపున పిల్లులు పుడతాయా?
పులిని చూచి నక్క వాత పెట్టుకొన్నట్లు
పులిమీద పుట్రలాగా
పులి మీసాలతో ఉయ్యాల ఊగినట్లు
పుల్లయ్య వేమారం వెళ్ళి వచ్చినట్లు
పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మినట్లు
పువ్వులా విచ్చుకుంటా తుమ్మెదలా దోచుకో అందట
పుష్యమాసంలో పూసలు గ్రుచ్చ పొద్దుండదు
పుష్యమాసానికి పూసంత వేసంగి
పుష్యమి కురిస్తే పిట్టకూడా తడవదు
పూచింది పుడమంత - కాచింది గంపంత
పూజకన్నా బుద్ధి - మాటకన్నా మనసు ప్రధానం
పూటకూళ్ళమ్మకు పుణ్యంతో పని లేదు
పూటకూళ్ళింటి తిండిలాగా
పూట గడుస్తుందిగానీ మాట నిలచిపోతుంది
పూనినకర్మ పొరుగూరు పోయినా తప్పదు
పూబోడీ అంటే, ఎవర్రా బోడి? నీ అమ్మబోడి, నీ అక్కబోడి అందట
పూర్ణం లేని బూరె - వీరణంలేని పెళ్ళి
పూవు పుట్టగానే పరిమళిస్తుంది
పూవు పుట్టగానే తెలుస్తుంది కళ
పెంటకొద్దీ పంట
పెట్టకపోయినా పెట్టే యిల్లు చూపమన్నారు
పెట్టగతులు లేకున్న పుట్టగతులు వుండవు
పెట్టనమ్మ పెట్టనే పెట్టదు పెట్టే ముండ కేమొచ్చింది రోగం అన్నాడట
పెట్టి దెప్పితివో - పెద్దల తిడితివో
పెట్టినదే తనది - కూడ బెట్టినది యితరులది
పెట్టినమ్మ పుణ్యాన - పెట్టనమ్మ పాపాన
పెట్టి పొయ్యనమ్మ కొట్టవచ్చిందిట
పెట్టు చుట్టం - తిట్టు పగ
పెట్టుబడిలేని సేద్యం - చద్దిలేని పయనం
పెడతానంటే ఆశ - కొడతానంటే భయం
పెడితే తింటారుగానీ తిడితే పడతారా?
పెడితే పెళ్ళి పెట్టకపోతే పెటాకులు
పెత్తనానికి పోతే దుత్త చేతికొస్తుంది
పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
పెదవీ పెదవి కలిస్తే మధువులు - ఒంపూ సొంపూ దక్కితే శోభనం
పెదవుల పరిచయం ఎదలకు పరిణయం అన్నట్లు
పెదవుల మధువులు, కౌగిలి విందులు మల్లెల జాతరలో అందట
పెదవుల రుచి పెదవులకే తెలుసన్నట్లు
పెదాలమ్మ వేటలో అలుపుండదన్నట్లు
పెద్ద యింటి గోత్రాలు దేవుడి కెరుక
పెద్ద యింటి రంకు, పెద్ద చెరువు కంపు తెలియవు
పెద్ద యింటి భాగోతం
పెద్దలమాట చద్దిమూట
పెద్దలు లేని యిల్లు - సిద్ధులు లేని మఠము
పెనము మీదనుంచీ పొయ్యిలో పడ్డట్లు
పెరటిచెట్టు మందుకు పనికిరాదు
పెరుగుట విరుగుట కొరకే
పెరుగుతూ పెరుగుతూ పెదబావ కోతి అయినట్లు
పెళ్ళంటే నూరేళ్ళ పంట
పెళ్ళాం పోతే పురుషుడు మళ్ళీ పెండ్లికొడుకు
పెళ్ళి అయిన యింటిలో ఆరునెలలు కరువు
పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో అన్నట్లు
పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టుకొని పోయినట్లు
పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళికూతుర్లేనా?
పెళ్ళికి వచ్చినవారే చేస్తారు పెళ్ళి పనులు, పెళ్ళామా! నీ ఒళ్ళు అలిపించుకోకు అన్నాడట
పెళ్ళికొడుకు కుడికాలు చూచి అత్త ఏడుస్తుంటే,
ఏడ్పులో ఏడ్పు ఎడమకాలూ చూడమన్నాడట తోడపెండ్లికొడుకు
పెళ్ళికొడుకు మావాడేగానీ, చెవి పోగులు మాత్రం మావిగావు అన్నట్లు
పెళ్ళినాటి పప్పుకూడు రోజూ దొరుకుతుందా?
పెళ్ళినాడే పరగడుపన్నట్లు
పెళ్ళిని చూస్తూ ఒకడుంటే, పెళ్ళాన్ని చూస్తూ ఒకడున్నాడట
పెళ్ళీ - పెటాకులు
పెళ్ళిలో పుస్తె కట్టడం మరచిపోయినట్లు
పేదకు పెన్నిధి దొరికినట్లు
పేదవాడి పెళ్ళాం వాడకెల్లా వదిన
పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి
పేదవాని కోపం పెదవికి చేటు
పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట
పేరు ఒకరిది - నోరు ఒకరిది
పేరు ఒకరిది - పెత్తనమొకరిది
పేరు ఒకరిది - సౌఖ్యమొకరిది
పేరుకే పెద్దరికం - బానిస బ్రతుకు
పేరు గొప్ప - ఊరు దిబ్బ
పేరు పల్లకీ మీద - కాలు నేల మీద
పేరు పెండ్లివారిది - తిండి యింటివారిది
పేరులేని వ్యాధికి పెన్నేరు మందన్నట్లు
పైన పటారం - లోన లొటారం
పైనబడ్డా నేనే గెలిచానన్నట్లు
పైపనీ, క్రింద పనీ నేను చూచుకుంటా సహకరించు అన్నాడట
పైపై పనేనా అసలు పనేమైనా వుందా అని అందిట
పైరుగాలి తగిలితే పంటకు ఏపు
పైరుకు ముదురు - పసరానికి లేత
పైసాకూ, ప్రాణానికి లంకె
పైసాలో పరమాత్ముడు
పొంకణాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు - మూడు ఎడ్లు
పొంగినదంతా పొయ్యిపాలే
పొంగే పాలను వూదరాదు - వెలిగే దీపాన్ని ఆర్పరాదు
పొంగే యౌవ్వనం కౌగిళ్ళపాలు అన్నట్లు
పొగచుట్టకు, పడతి యోనికి ఎంగిలి లేదు
పొగాకు కొనుక్కోవాలి అందలం బయటపెట్టరా అన్నాడట
పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా భూమాతే యివ్వాలి
పొట్టకోస్తే అక్షరం ముక్క లేదన్నట్లు
పొట్టి గట్టి
పొట్టివానికి పుట్టెడు బుద్ధులు
పొట్లచెట్టుకు పొరుగు గిట్టదు
పొడుగు లొడుగు
పొత్తుల మగడు పుచ్చిచస్తాడు
పొదుగు కోసి పాలు త్రాగినట్లు
పొదుగులేని ఆవు పాలిస్తే నాలుకలేని పిల్లి నాకి పోయిందట
పొద్దు తిరుగుడు - డొంక తిరుగుడు
పొద్దు గడిచిపోతుంది మాట నిలిచిపోతుంది
పొద్దున్నే వచ్చిన వాన - ప్రొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు
పొమ్మన లేక పొగ పెట్టినట్లు
పొయ్యి ఊదిందంటే బంధువుల రాక
పొయ్యిలో పిల్లి లేవలేదు
పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదు అన్నాడట
పొరుగమ్మ సరిపెట్టుకుంటే - ఇరుగమ్మ ఉరిపెట్టుకుంది
పొరుగింట చూడరా నా పెద్ద చెయ్యి
పొరుగింటి కలహం వినవేడుక
పొరుగింటి జగడం చూడవేడుక
పొరుగింటి పుల్లకూర రుచి
పొరుగింటి పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు
పొరుగూరి వ్యవసాయం - ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే
పోకముడి విప్పుతూ కోక వెల అడిగినట్లు
పోచికోలు వాగుడు
పోనున్నది పోకమానదు
పోయిన నీటికి కట్ట కట్టినట్లు
పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదట
పోయే కాలానికి కాని బుద్ధి
పోరాని చోట్లకు పోతే రారాని నిందలు వచ్చినట్లు
పోరిన పొరుగు - దాచిన కుండలు మనవు
పోరుకు సిద్ధమయితే పోటుకు సిద్ధం అన్నాడట
పోరు నష్టం -పొందులాభం
పోలీ! పోలీ! నీ భోగమెన్నాళ్ళే అంటే మాఅత్త మాలవాడనుండి వచ్చేదాకా అన్నదట
ప్రజల మాట ప్రభువుకు కోట
ప్రజలే ప్రభువుకు అండ
ప్రదక్షిణాలు చేస్తూ కడుపు చూచుకున్నదట
ప్రమిదలో వత్తేసి కళ్ళలో దీపాలు వెలిగించు అందిట
ప్రయాణం అబద్ధం - ప్రసాదం నిబద్ధం
ప్రసూతి వైరాగ్యం పురిటి పచ్చి ఆరేదాకానే
ప్రాణముంటే భయంలేదు
ప్రాణముంటే శివం - ప్రాణం పోతే శవం
ప్రాణం పోయినా మానం పోరాదు
ప్రాణం వున్నప్పుడే పంతాలు నెరవేరుతాయి
ప్రాయాన పుట్టిన కొడుకు
ప్రాస కోసమేడ్చానే కూసుముండా అన్నట్లు
ప్రియం మహాలక్ష్మి - చౌక శనేశ్వరం
ప్రీతితో పెట్టింది పట్టెడయినా చాలు
ప్రేమలో పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు
ప్రేమలేని మాట పెదవి పైనే
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )