భాష సామెతలు
యతిమతం మొగుడికి ఎత్తుబారపు పెళ్ళాం
యదార్థవాదీ లోక విరోధీ
యథా పతీ తథా సతీ అన్నట్లు
యాదవకులంలో ముసలం పుట్టినట్లు
యిష్టమైన పియ్య యింగువతో సమానం
యోగికీ, రోగికీ, భోగికీ నిద్ర వుండదు
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా?
రంకులాడికి నిష్ఠలు మెండు
రంకు సాగితే పెళ్ళెందుకు?
రంగడికీ లింగడికీ స్నేహం - రొట్టెకాడ గిజగిజలు
రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు?
రతిలో సిగ్గు - రణములో భీతి కొరగావు
రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు
రత్నాలన్నీ ఒకచోట - రాళ్ళన్నీ మరొకచోట
రవిక సవరిస్తూ కోకముడి విప్పినట్లు
రసదెబ్బ తగలినిదే రంకు పుండు మానదు
రహస్యం ఏమిటంటే, వడ్లగింజలోనిది బియ్యపుగింజ అన్నట్లు
రక్షించినవాడినే భక్షించినట్లు
రాగం తీయనివాడు, రోగం రానివాడు లేడు
రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు
రాగి రా గోరును
రాచపగ - పాము పగ
రాచపీనుగు తోడు లేకుండా పోదు
రాజకీయం తీరెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు
రాజు కొడుకైనా కావాలి - సానిదాని తమ్ముడైనా కావాలి
రాజు గుర్రం గాడిదైనట్లు
రాజుగారి పెద్ద భార్య పతివ్రత అన్నట్లు
రాజు తలిస్తే దెబ్బలకు కొదువా!
రాజుగారు వస్తున్నారంటే, పెళ్ళాంవంక అనుమానంగా చూసినట్లు
రాజు తలిస్తే రాయికూడా పగులుతుంది
రాజును చూచిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్ట బుద్ధయిందిట
రాజు మెచ్చింది మాట
రాజుల సొమ్ము రాళ్ళపాలు
రాజుల హృదయం రాతితో సమం
రాజ్యం వీరభోజ్యం
రాజ్యాలు పోయినా రాజసాలు పోలేదన్నట్లు
రాతిలో కప్ప రాతిలోనే బ్రతుకుతుంది
రానప్పుడు బ్రహ్మ విద్య - వచ్చినప్పుడు కూసు విద్య
రాని అప్పు రాతితో సమానం
రాని వానిని పిలువ వేడుక
రానున్నది రాక మానదు - పోనున్నది పోకమానదు
రామ రామ అంటే రోమ రోమానికీ ఎక్కిందట
రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్లు
రామాయణం రంకు - భారతం బొంకు
రామాయణంలో పిడకల వేట అన్నట్లు
రామాయణంలో పిడకల వేట - ప్రేమాయణంలో పడతుల వేట అన్నట్లు
రామాయపట్నం మధ్యస్థం అన్నట్లు
రామునివంటి రాజుంటే హనుమంతునివంటి బంటూ వుంటాడు
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు
రావణాసురుడి కాష్టంలాగా
రావాలంటే త్రోవేలేదా, కావాలంటే కరుణే రాదా!
రాసలీల వేళలో రాయబారమన్నట్లు
రాసుకుంటే రంగూకాదు - పూసుకుంటే పుణ్యం రాదు
రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకొన్నట్లు
రుచీపచీలేని కూర కంచానికి చేటు - అందం చందంలేని పెళ్లాం మంచానికి చేటు
రూక లేనివాడు పోకచేయలేడు
రూపాన గర్విష్టి - గుణాన పాపిష్టి
రెంటికీ చెడ్డ రేవడిలాగా
రెండావుల దూడ
రెండు చేతులు కలిస్తేనే చప్పుడు
రెండు నాలుకలవాడిలాగా
రెండు పడవల పైన కాళ్ళు పెట్టినట్లు
రెక్కలు విరిగిన పక్షిలాగా
రెక్కాడితేగానీ డొక్కాడదు
రెడ్డొచ్చె మొదలాడమన్నట్లు
రెప్పలార్పేవాళ్ళు కొంపలార్పుతారు
రేచీకటి మొగుడికి గుడ్డి పెళ్ళాం
రేయంతా సొగసులాట - పగలంతా పరధ్యానం
రేపటి నెమలికంటే నేటి కాకి మేలు
రేపటి నొప్పుల మాటెలా వున్నా ఈ పూట ఈ నొక్కుళ్ళే బాగున్నాయి అందిట
రేపల్లెవాడలో పాలమ్మినట్లు
రేపు రేపంటే రేప్‌ చేసి చూపించాడట
రేవతి వర్షం రమణీయం
రైతు దున్నితేనే రాజులకు అన్నం
రైతు లెక్కచూస్తే నాగలి కూడా మిగలదు
రొక్కమిచ్చినవాడే వెలయాలికి మన్మథుడు
రొట్టెకు రేపు లేదు
రొట్టెముక్క యిస్తే పండుగ అన్నట్లు
రొట్టెలవాడి పనికంటే ముక్కలవాడి పనిమేలు
రొట్టె విరిగి నేతిలో పడినట్లు
రొయ్యకు లేదా మూరెడు మీసం?
రోగ మొకటి - మందొకటి
రోగానికి మందుందిగానీ మనోవ్యాధికి మందుందా?
రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా?
రోగికి కోపమెక్కువ
రోగి కోరుకుందీ పాలే వైద్యుడు చెప్పిందీ పాలే
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు?
రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు
రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు
రోషం లేని మూతికి మీసమెందుకు?
రోషానికి రోలు మెడకు కట్టుకున్నట్లు
రోహిణి ఎండలకు రాళ్ళు పగులుతాయి
రోహిణిలో విత్తుట రోటిలో విత్తినట్లే
రోహిణిలో రోకళ్ళు చిగుర్చనన్నా చిగురిస్తాయి, రోళ్ళు పగులనన్నా పగుల్తాయి
రోహిణిలో విత్తటం రోళ్ళు నిండని పంట
రౌతుకొద్దీ గుర్రం
రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది
లంక మేతకు - ఏటి ఈతకు సరి
లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులే
లంఖణం పరమౌషధం
లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు
లంచం లేనిదే మంచ మెక్కనన్నట్లు
లంజకు మొగుడొకడా?
లంజకు నిక్కు - సంసారికి సిగ్గు
లంజకు పిల్ల తగలాటము
లంజకు పెట్టిన సొమ్మూ - గోడకు వేసిన సున్నం తిరిగి రావు
లంజకు సిగ్గు తెగులు
లంజ చెడి యిల్లాలయినట్లు
లంజను లంజా అంటే రచ్చకెక్కుతుంది - ఇల్లాలిని లంజా అంటే యింట్లో దూరుతుంది
లక్కవంటి తల్లి - రాయివంటి బిడ్డ
లగ్నంలో తుమ్మినట్లు
లక్షాధికారయినా కావాలి - భిక్షాధికారయినా కావాలి
లాభం గూబల్లోకి వచ్చింది
లాభంలేని శెట్టి వరదకు పోడు
లుక్కులు గాదు లిప్పులు కావాలన్నాడట
లెక్క చూస్తే బొక్క పగులుతుంది
లేడికి లేచిందే ప్రయాణం
లేడిని చూచినవాళ్ళంతా వేటగాళ్ళే
లేని త్యాగి కంటే ఉన్న లోభి మేలు
లేని దాత కన్నా ఉన్న లోభి నయం
లేనిదాని కోసం పోతే ఉన్నది కాస్తా ఊడిపోయిందట
లేనిపోని పీకులాట ఎందుకట!
లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాటట
లేనివాడి తెగింపు కంటే ఉన్నవాడి పిరికితనం మేలు
లేవలేని అత్తకు వంగలేని కోడలు
లొసుగుల బేరం కాసుల చేటు
లోకం మూయను మూకుడున్నదా?
లోకులు పలుకాకులు
లోగుట్టు పెరుమాళ్ళకెరుక
లోభికి ఖర్చెక్కువ - ఏబ్రాసికి పనెక్కువ
లోభికి నాలుగందాల నష్టం
లోభికి ధర్మచింతన మెండు
లోభి సొమ్ము దొంగపాలు
వంకరో టింకరో వయసే చక్కన
వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందట
వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువ
వంటింటి కుందేలు ఎక్కడికి పోతుంది?
వంటిల్లు కుందేలు చొచ్చినట్లు
వండని అన్నం - వడకని బట్ట
వండలేనమ్మకు వగపులు మెండు - తేలేనమ్మకు తిండి మెండు
వండాలేదు, వార్చాలేదు - ముక్కున మసెక్కడిది అన్నట్లు
వండుకున్నమ్మకు ఒకటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలు
వంతుకు గంతేస్తే దిగింది బుడ్డ
వంద మాటలు చెప్పొచ్చు - ఒక్కనికి పెట్టేదే కష్టం
వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లు
వంపున్న చోటకే వాగులు
వంపుసొంపులే ఫలపుష్పాలు - లేత పెదిమలే తమలపాకులు అన్నట్లు
వంశమెరిగి వనితను - వన్నెనెరిగి పశువును తెచ్చుకోవాలి
వగలమారి వంకాయ సెగలేక ఉడికిందట
వగలెందుకంటే పొగాకు కోసం అన్నట్లు
వచ్చింది కొంత - పఠించింది కొంత
వచ్చింది పాత చుట్టమే - పాత చేట గొడుగు పట్టండి అన్నట్లు
వచ్చిననాడు వరాచుట్టం - మరునాడు మాడ చుట్టం - మూడవనాడు మురికి చుట్టం
వచ్చిన పేరు చచ్చినా పోదు
వచ్చినవారికి వరాలు - రానివారికి శాపాలు
వచ్చిపోతూ వుంటే బాంధవ్యం - ఇచ్చి పుచ్చుకుంటూంటే వ్యాపారం
వచ్చీరాని మాట వరహాల మూట
వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచి
వచ్చేకాలం కన్నా వచ్చిన కాలం మిన్న
వచ్చే కీడు వాక్కే చెపుతుంది
వచ్చేగండం చచ్చినా తప్పదు
వచ్చేటప్పుడు వెంట తీసుకురారు - పోయేటప్పుడు వెంట తీసుకుపోరు
వజ్రానికి సాన - బుద్ధికి చదువు
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి
వట్టి గొడ్డుకు అరుపు లెక్కువ
వట్టి చేతులతో మూర వేసినట్లు
వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయి
వట్టి మాటలు కూటికి చేటు
వడ్డించినదంతా మేం తింటాం ఆకులు మీరు నాకండి అన్నట్లు
వడ్డించేవాడు మనవాడయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు
వడ్లగాదిలో పందికొక్కులాగా
వడ్లగింజలో బియ్యపు గింజ
వడ్లతో గూడా తట్ట ఎండినట్లు
వడ్లల్లో, రెడ్లల్లో ఎన్నో రకాలన్నట్లు
వడ్లూ గొడ్లూ ఉన్నవానిదే వ్యవసాయం
వనితకూ వయసుకూ తోడు కావాలి
వయసుకు వర్జ్యం లేదన్నట్లు
వయసుకోట వాయనం, సొగసుతోట పాయసం అన్నట్లు
వనితగానీ, కవితగానీ వలచిరావాలి
వయసు తప్పినా వయ్యారం పోలేదు
వయసుపడే ఆరాటం సోయగాల సమర్పణకే అన్నట్లు
వయసు ముసలెద్దు - మనసు కోడెదూడ
వరహాకన్నా వడ్డీ ముద్దు - కొడుకుకన్నా మనమడు ముద్దు
వరాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్లు
వరిమొలకా, మగమొలకా ఒకటి
వలచివస్తే మేనమామ కూతురు వరుస కాదన్నట్లు
వలపులు మనసుల్ని తడితే కోరికలు తనువుల్ని తడతాయట
వసుదేవుడంతటివాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు
వస్తూ ఏమి తెస్తావు? పోతూ ఏమిస్తావు?
వస్త్రహీనం - విస్తరి హీనం పనికిరావు
వాచినమ్మకు పాచినన్నం పెడితే పరమాన్నం పెట్టారని ఇరుగుపొరుగులకు చెప్పుకొన్నదట
వాగాడంబరం - అధిక ప్రసంగం
వాతలు మానుతాయి - వాదులు పోవు
వాదులేక ప్రాణం - దాదిలేక రాణి పోరు
వానకంటే ముందు వరద వచ్చినట్లు
వానరాకడ, ప్రాణం పోకడ తెలియదు
వానలకు మఖాకార్తె - కుక్కలకు చిత్తకార్తె
వానవుంటే కరువులేదు - మగడు వుంటే దరిద్రం లేదు
వాన వెలసినా చూరునీళ్ళు పడుతున్నట్లు
వాపును చూచి బలుపనుకున్నట్లు
వాపు బలుపు కాదు - వాత అందం కాదు
వాములు తినే స్వాములవారికి పచ్చగడ్డి ఫలహారం అన్నట్లు
వాసి తరిగితే వన్నె తరుగుతుంది
విందు అయినా మూన్నాళ్ళు - మందు అయినా మూన్నాళ్ళు
విందు మర్నాడు మందు
విగ్రహపుష్టి - నైవేద్య నష్టి
విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలన్నట్లు
విడవమంటే పాముకు కోపం - పట్టమంటే కప్పకు కోపం
విడిచిన ముండకు వీరేశలింగం
విడిచినమ్మలు వియ్యమందబోతే అంతకంటే అడ్డాలమ్మ వచ్చి హారతిపట్టిందట
విడిచేసిన వాడు వీధికి పెద్ద
విత్తం కొద్దీ వైభవము
విత్తటానికి శుక్రవారం - కోయటానికి గురువారం
విత్తు ఒకటయితే చెట్టు ఒకటౌతుందా?
విత్తుకొద్దీ పంట
విత్తు ముందా? చెట్టు ముందా?
విదియనాడు రాని చంద్రుడు తదియనాడు తనకు తానై కనబడతాడు
విద్య కొద్దీ వినయము
విధం చెడ్డా ఫలం దక్కాలి
విధి వస్తే పొదలడ్డమా?
వినాయకుడి మీద భక్తా? ఉండ్రాళ్ళ మీద భక్తా?
విని రమ్మంటే తిని వచ్చినట్లు
వినేవాటికీ - కనేవాటికీ బెత్తెడే దూరం
విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు
విన్నమ్మ వీపు కాలింది - కన్నమ్మ కడుపు కాలింది
వియ్యానికి కయ్యం తోబుట్టువు
వియ్యానికయినా కయ్యానికయినా సమవుజ్జీ వుండాలి
వియ్యాలందితే కయ్యాలందుతాయి
విరిగిన వేలు మీద ఉచ్చ పోయనన్నట్లు
విరుచుకుని విరుచుకుని వియ్యాలవారింటికి పోతే పలుగురాళ్ళతో నలుగు పెట్టారట
విల్లంబులు కలవారికి చల్లకుండలవారు తోడా?
విశాఖ కురిస్తే విషము పెట్టినట్లే
విశాఖ చూచి విడువర కొంప
విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లే
విశాఖలో వర్షం - వ్యాధులకు హర్షం
విశాఖలో వరదలు - సంక్రాంతికి మబ్బులు
విషానికి విషమే విరుగుడు
విస్తరి కొదవా, సంసారపు కొదవా తీర్చేవారు లేరు
విస్తరి చిన్నది - చెయ్యి పెద్దది
విస్సన్న చెప్పింది వేదం
వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు
వీపున కొట్టచ్చుగానీ, కడుపుమీద కొట్టరాదు
వీరభద్రపు పళ్ళెములాగా
వీలెరిగి మాట - కీలెరిగి వాత
వీసం యిచ్చి గంపెడు అడిగినట్లు
వీసంలో మానెడు తీసినట్లు
వృద్ధనారీ పతివ్రత
వృద్ధ వైద్యం - బాల జోస్యం
వృష్టికి ప్రమాణాలు - ఉత్తర, హస్త కార్తెలు
వెంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది
వెంటపోయినా వెనుక పోరాదు
వెంట పోయైనా చూడాలి - వెంట వుండయినా చూడాలి
వెంపలి చెట్టుకు నిచ్చెన వేసినట్లు
వెక్కిరించబోయి వెల్లికిలా పడ్డట్లు
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు
వెదకబోయిన తీర్థం ఎదురయినట్లు
వెధవముండ కాళ్ళకు మ్రొక్కితే నాలాగే వర్ధిల్లమని దీవించిందట
వెనక నొక్కుళ్ళేనా ముందు పనులున్నాయా అందిట
వెన్న అరచేతిలో పెట్టుకుంటే అడక్కుండానే కరుగుతుంది
వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లత్రాగిన వాడ్ని కొట్టినట్లు
వెన్న పెడితే తినలేడు - వేలు పెడితే కొరకలేడు
వెన్ను ముదిరినట్లు
వెన్నెల వేళే విరహాలన్నట్లు
వెయ్యి అబద్ధాలు చెప్పయినా ఒక పెళ్ళి చేయాలి
వెయ్యి గుళ్ళ పూజారి
వెర్రి కుదిరింది - తలకు రోకలి చుట్టమన్నాడట
వెర్రివాడా వెర్రివాడా అంటే వెక్కెక్కి ఏడ్చాడట
వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ లోకువ
వెర్రివాడి పెళ్ళాం వాడకంతటికీ మరదలు
వెర్రివాడి పెళ్ళాం వాడకల్లా వదినే
వెర్రివాడికి పెళ్ళిచేస్తే వేలెట్టి కెలికాడట
వెర్రివాని చేతి రాయిలాగా
వెర్రి వేయి విధాలన్నట్లు
వెల తక్కువ - ఫల మెక్కువ
వేటుకు వేటు - మాటకు మాట
వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడయినట్లు
వేడినీళ్ళకు ముందు, పంక్తి భోజనానికి వెనుక పోగూడదు
వేడుకకు వెల లేదు
వేలు మీద గోరు మొలిచింది వేరుపోదాం రారా మగడా! అన్నదట
వేలం వెర్రి - గొర్రెవాటు
వేలుకు వేలు ఎడమా?
వేలు చూసి అవలక్షణ మనిపించుకొన్నట్లు
వేలు చూపితే హస్తం మింగుతాడన్నట్లు
వేలు పెట్టేందుకు చోటిస్తే తల దూర్చినట్లు
వేలు వంక పెడితేగానీ వెన్న రాదు
వేలు వాచి రోలంతయితే, రోలు వాస్తే మరెంత కావాలి?
వేశ్య - వైశ్యుడు అబద్ధాల కోరులే
వేషాల కోసం దేశాల పాలయినట్లు
వేషాలమారికి వేవిళ్ళొస్తే, ఉన్నచోటు విడవను అన్నదట
వేషాలెన్ని వేసినా కూటి కోసమే
వేసిందే ఒక గంతు - దిగిందే ఒక బుడ్డ
వేసిందే ఒక గంతు - విరిగిందే ఒక కాలు
వేసిన వత్తికి - పోసిన చమురుకు సరి
వేసినట్టే వేస్తే వెర్రివాడైనా గెలుస్తాడు
వేసేది విషముష్ఠి విత్తనాలు - ఆశించేవి మధుర ఫలాలు
వైదీకి వైద్యంలో చచ్చినా ఒక్కటే బ్రతికినా ఒక్కటే
వైద్యం నేర్వనివాడూ - వానకి తడవనివాడూ వుండడు
వైద్యుడి పెళ్ళాంగూడా ముండ మోసేదే
వైద్యుడు రోగాలు కోరు - వైశ్యుడు కరువు కోరు
వైద్యుని భార్యకే భగంధర రోగము
వైద్యుని పేరు చెపితే రోగాలు పారిపోతాయా?
వైరాగ్యం ముదిరితే వారవనిత కూడా తల్లితో సమానం
వ్యవసాయం గుడ్డాడి చేతిరాయి
వ్యసనం ఏడూళ్ళ ప్రయాణం
వ్యాధికి రట్టు, సంసారానికి గుట్టు కావాలి
వ్యాధికి మందుకానీ విధికి మందా?
వ్యాపారం జోరుగా సాగుతోంది, రెండో బర్రెను అమ్మి డబ్బు పంపమన్నాడట
వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోక్తమా?
వ్రతం చెడ్డా ఫలం దక్కాలి
వ్రాత కరణమా? మేత కరణమా? అన్నట్లు
వ్రాత బలికోరును
వ్రాయగా వ్రాయగా కరణం - దగ్గగా దగ్గగా మరణం
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )