దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
01. ఊడ్పుల ప్రారంభం
గనపతయ్య
గనపతయ్య
ఉండ్రాళ్ళూ నీకుపోతురా
ఓ గనపతయ్య
మందకొడిగ వుండబోకురా...

    గనపతయ్య
    గనపతయ్య
    జమ్మిపత్రిపూజసేతురా
    ఓ గనపతయ్య
    ముందెనీకు పూజసేతురా...

గనపతయ్య
గనపతయ్య
మనసునిండు పూజసేతురా
ఓ గనపతయ్య
మమ్ము ఎపుడు మరువబోకురా...

    గనపతయ్య
    గనపతయ్య
    ఊరిలోన ఊరేగించెదా
    ఓ గనపతయ్య
    ఉయ్యాలల ఊపుతానురా...

గనపతయ్య
గనపతయ్య
ఉండ్రాళ్ళూ నీకు పోతురా
ఓ గనపతయ్య
మమ్ము ఎపుడు మరువబోకురా...
AndhraBharati AMdhra bhArati - uuDpula praaraMbhaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )