దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
04. హైలాసో
హైలాసో - హవ్వారి హవ్వ
లాగరోరీ - లంగరు తాడూ
పీకరోరీ పిలాడి జుత్తూ
జంబైరే జోతు లంగరి
లాగరోరీ లంగరు తాడూ...

మూడునెల్లా ముండాలపోరూ
ఆరునెల్లా జన్మఖైదు
ఎక్కరానీ పడవా మీదా
సెప్పరానీ దుక్కామొచ్చే
హైలేసో - హవ్వారి హవ్వ.
AndhraBharati AMdhra bhArati - hailaasoo jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )