దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
10. తలుపు దగ్గర పాట
శ్రీకాంతామణి నే నీ సఖుడను
శీఘ్రము వాకిలి తీవే నీవు
శీఘ్రము వాకిలి తీవే.
    ఓ కాంతుడ నీగుణములు తెలిసెను
    ఊరికె వెళ్ళగదోయీ నీవు
    ఊరికె వెళ్లగదోయీ.
ఈ మాటలు నీవెన్నడాడవైతి
ఏమే అలుమెలుమంగా అది
ఏమే అలుమేలుమంగా.,
    భామలమరగిన వాడవు నాతో
    పలుకులేలసో - పోయీ - యీ
    పలుకులేల పోవోయీ.
పరభామలనే కూడితినని యిటు
పలుకుట కారణమేమే సఖి
పలుకుట కారణమేమే.
    తరుణులకూడక యుంటే పువ్వుల
    దండలు ఎక్కడివోయీ పూల
    దండలు ఎక్కడివోయీ.
హరిహరి నేనేమెరుగను - భక్తులు
అర్పించిరె వో చెలియా - నా
కర్పించిరె వో చెలియా.
AndhraBharati AMdhra bhArati - talupu daggara paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )