దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
13. ఏల పాట
సూర్యచంద్ర వహ్ని నడుమా
శౌర్యమానే చిలుకగంటీ
సూర్యదీప్తి గాయుచుండాగా - యేగంటి లింగా
చూడజూడాశ్చర్యమాయెరా.

కాంతాలపాలెములోన
చింతమానూ పుట్టెగదరా
చింత అనలూ కొనలు సాగానా - యేగంటి లింగా
చింతపూసీ పండుపండేరా.

కానరాని యడవిలోన
వానలేని మడుగునిండె
వానలేని మడుగుమీదానూ - యేగంటి లింగా
మానరానీ అగ్ని పొడమేరా.

ఆకులేని యడవిలోన
తోకలేని మృగము పుట్టె
తోకలేని మృగము కడుపునా - యేగంటి లింగా
ఈకలేని పక్షి బుట్టెరా.
AndhraBharati AMdhra bhArati - eela paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )