దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
14. వరికోత పాట
జంబైలోలే - జోతులంగరు.
అన్నాలారా - తమ్మూలారా
జంబైలోలే - జోతులంగరు.
జోరీగుళ్ళా యీదీలోనూ
జోరూచేసీ పలకారన్నా
మిద్దీమీదా - మిరపాచెట్లూ
నీళ్ళులేకా - జోగీపోయే
అంతరాలు - పడవామీదా
అందీపూలూ - కోయాబోతే
రాలీపూవూ - రంగామెల్లి
రంగామంతా భంగాపుచ్చే
మంచినీళ్ళ - బావీకాడ
పుట్టామీద - పాలా పిట్ట
కొట్టాబోతే - తేలూకుట్టె
బావాగారు మంతారించె
భల్లూ భల్లూ తెల్లా వారె
ఎఱ్ఱ చెరువూ గట్లామీద
ఎడ్లామేపే - చిన్నవాడా
ఎడ్లాకేసే - పోలీకేక
నాకుయేస్తే నేనూరాను.
AndhraBharati AMdhra bhArati - varikoota paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )