దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
18. జాలిబొంబైలే
జాలి బొంబైలే - జాలిరా ఓ బేలిజెల్ల
జాలి బొంబైలే - అన్నలార తమ్ములార
జాలి బొంబైలే - అందమైన శూరులార
జాలి బొంబైలే - సూరుమోత బేరిమోత
జాలి బొంబైలే - నూగునూగు మీసగాళ్ళు
జాలి బొంబైలే - నూటికొక్కా కాపుబిడ్డ
జాలి బొంబైలే - జోరుతో జొన్నాడదాటి
జాలి బొంబైలే - బారుతో బందారుదాటి
జాలి బొంబైలే - జాలిరా ఓ బేలిజెల్ల...
AndhraBharati AMdhra bhArati - jaaliboMbailee jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )