దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
19. ఊడ్పు పాట
ఓ అరిజెల్ల
బేరిమోత
ఓ నల్లనేలల
దున్నదలచేరా
మొక్కబోతే
ఓ దయ్యమైరా
పట్టినాదీరా
ఓ మానయంబారా
గాలి మోతారా
దూలి మోతారా
ఓరేమిరన్నయ్యా
ఓ ఉసారి లేదురా
ఓ రాగి డబ్బూరా
యీడు ముంతారా
ఓ బొట్టుపెట్టారా
బొమ్మ చూడారా
ఓ మిద్దె మీదారా
మిరప చెట్టురా
ఓకాయ చూడారా
ఓ నీలు లేవూరా
పాలు లేవూరా
ఓ కూకున్నాదీరా
కుఱ్ఱగుంటారా
ఓ మేతి రోడూరా
దానెంప వెళ్ళారా
ఓరి కుంచమంతరా
ఓ గుడిసెలోనురా
ఓ మానికంతరా
ఓ రోలు తోసెరా

ఓ అరిజెల్ల
బేరిమోత
AndhraBharati AMdhra bhArati - uuDpu paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )