దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
22. ఓ నల్లదాన
అంచూన నల్లజీర
అచ్చాము తెల్లతీర
అందూన శీతాఫలమే
    ఓ నల్లదాన
అందూ నా మనసే
    ఓ నల్లదానా
గొప్పాగ నిన్నుచేరి
నీటూగ యాత్ర కెడితె
నీతీకి భంగమాయెనే
    ఓ నల్లదాన
నిన్నూనే విడువాబోనే
    ఓ నల్లదానా
చెంపాను కమ్మల జంట
చేతూల గాజుల జంట
నీముందు సోకులెందుకే
    ఓ నల్లదానా
నాయందు పరాకెందుకే
    ఓ నల్లదానా
AndhraBharati AMdhra bhArati - oo nalladaana jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )