దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
27. తలుపు దగ్గర పాట
శివభక్తులకే దయగలవాడను
శివుడందురు నా పేరూ - సాంబ
శివుడందురు నా పేరూ

    శివనామంబులు సకలెందుల జెల్లును
    చేరికతో వుండవోయీ - శివ
    చేరికతో వుండవోయీ

వడిగిన లందిన కుంతన లొసగెటి
ఉరపతి దరుడనె గౌరీ - నే
ఉరపతి దరుడనె గౌరీ

    ఉరపతి దరుడవైతే యెలాయెను
    వదలు కడకు పోవోయీ - శివ
    వదలు కడకు పోవోయీ

బలాన రాముడు బలసతి నడిగిన
బలిదుండుడనే గౌరీ - నే
బలిదుండుడనే గౌరీ

    బలిదుండుడవైతే యేలాయెను
    భక్తులిళ్ళకు పోవోయీ - శివ
    భక్తులిళ్ళకు పోవోయీ

కొమరుగ గంగని జటలో నించుకు
కొమర జంగాన్నే గౌరీ - నే
కొమర జంగాన్నే గౌరీ

    కొమర జంగమైతేమాయెను
    కొమరులిండ్లకు పోవోయీ - శివ
    కొమరులిండ్లకు పోవోయీ

కాశీ లోపల యేక్షము లొసగెటి
గంగాధరుడనె గౌరీ - నే
గంగాధరుడనె గౌరీ

    వాశికి యోలాగైతిరిగే మీరు
    వార్నాశివై యుండవోయీ - శివ
    వార్నాశివై యుండవోయీ
AndhraBharati AMdhra bhArati - talupu daggara paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )