దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
32. లాలి పాట
లాలీ లాలమ్మా లాలీ
లాలమ్మ లాలీ లాలమ్మ లాలీ
లాలమ్మ గుఱ్ఱాలు
లంకల్లో మేసే - లంకల్లో మేసే
బుల్లెమ్మ గుఱ్ఱాలూ
బీడుల్లో మేసే - బీడుల్లో మేసే
అప్పన్న గుఱ్ఱాలూ
అడవుల్లో మేసే - అడవుల్లో మేసే
ఊరుకో అబ్బాయి
వెఱ్ఱీ అబ్బాయీ - వెఱ్ఱీ అబ్బాయీ
ఉగ్గెట్టు మీయమ్మ
ఊరు కెళ్ళిందీ - ఊరు కెళ్ళిందీ
పాలిచ్చు మీయమ్మ
పట్టా మెళ్లిందీ - పట్టా మెళ్లిందీ
నీలోసె మీయమ్మ
నీల కెల్లిందీ - నీల కెల్లిందీ
AndhraBharati AMdhra bhArati - laali paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )