దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
34. దంపు పదం
కోడలా కోడలా
పచ్చిపాల మీద
మీగడేదే?
వేడిపాలా మీద
వెన్న లేదే?        ॥కో॥

    అత్త నువుబెట్టి
    ఆరేళ్ళుగాని
    పచ్చిపాలామీద
    మీగ డుంటుందా?
    వేడిపాలామీద
    వెన్న వుంటుందా?        ॥అత్త॥
AndhraBharati AMdhra bhArati - daMpu padaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )