దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
44. చేనుకోత పాట
ఏలే మాలి
ఏలే మాలి
ఏ... సో - ఓహో...
ఏటీ మీద
పనా మాలి - ఏ... సో...
ఏటీ వార
యేపా జెట్టు - ఏ... సో...
ఎక్కీ చూస్తె
ఢిల్లీకోట - ఏ... సో...
ఢిల్లీకోట
చల్లాగుంటె - ఏ... సో...
చిల్లారప్పులు
చెల్లాగొడత - ఏ... సో...
పాలా పాల
పాలా పాల - ఏ... సో...
పాలా పాల
బలుసూ కూర - ఏ... సో...
నేలా నేల
నెల్లీకూర - ఏ... సో...
పుట్టామీద
పాలాపిట్ట - ఏ... సో...
కొట్టాబోతే
తేలూకుట్టె - ఏ... సో...
బావాగారు
మంతారించె - ఏ... సో...
భళ్లూ భళ్లున
తెల్లావారె - ఏ... సో...
నేలా నేల
నేలా మీద - ఏ... సో...
అలీ కొమ్మల
చింతా చిగురూ - ఏ... సో...
వండీ పెడ్తిమి
వలపూ తీరె- ఏ... సో...
AndhraBharati AMdhra bhArati - cheenukoota paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )