దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
46. దంపు పాట
దంపు దంపా లేను
దంపా చూడా లేను
దండెత్తి ధాన్యమూ
దంచాగా లేనూ
సువ్వి - హా - సువ్వి.
    నిమ్మలా బుగ్గపాప పుట్టీనాడూ
    నిమ్మతోటకు తోడి నీరెట్టినాడూ
    నిలువునా నిమ్మల్లు లేచి కాయంగ
    నిగనిగా పండ్లన్ని బుట్టాలు నిండ
    సువ్వి - హా - సువ్వి.
సంతకూ బుట్టలూ బండ్లాతో చేర్చె
సంతోషమున డబ్బు జేబూలొకొచ్చె
సరసాల కాతోట సల్లన్ని తోట
సంతపోయే జనపు సంపెంగ తోట
సువ్వి - హా - సువ్వి.
AndhraBharati AMdhra bhArati - daMpu paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )