దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
47. సరసాలు
చక్కాని గుంటా
సరసను గూచుంటా
ఏ తంట లేకపోతే
నా యంట రాయే
చక్కని గుంటా...

సినిమా చూపెడత
నేతిమిఠాయి కొనిపెడత
ఏ తంట లేకపోతే
నా యెంట రాయే
చక్కాని గుంటా...
AndhraBharati AMdhra bhArati - sarasaalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )