దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
48. ప్రశ్నలు
కూరండ గలవా
కుమ్మండ గలవా
కుండాతో జొన్నాల
కూడొండ గలవా?
    కూరండ లేనూ
    కుమ్మండ లేనూ
    కుండాతో జొన్నాల
    కూడొండ లేనూ.
వరికొయ్య గలవా
వలలల్ల గలవా
వలలోని చేపాల
పులుసొండ గలవా?
    వరికొయ్య లేనూ
    వలలల్ల లేనూ
    వలలోని చేపాల
    పులుసొండ లేనూ.
సంతా కెళ్ళ గలవ
సరకూలు తేగలవ
సరసోడు చూతేను
సర్దాడు కొనగలవ?
    సంతాకు యెల్లగలను
    సరకూలు తేగలను
    సరసోడు చూడకుండ
    సరసాలు ఆడగలను.
AndhraBharati AMdhra bhArati - prashnalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )