దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
49. రోడ్డు వేస్తూ పాడే పాట
జోరులో జొన్నాడ దాటి
బారులో బందారు దాటి
ఓ లాగరా లాగార నాయన
ఓ నిమ్మ చెట్టుకి నిచ్చెనేసి
నిమ్మపళ్ళు కొయ్యబోతే
నిమ్మముల్లు రొమ్మునాటె
ఓ చీరులొల్ల చిత్తకల్లు
రయికలొల్ల రత్తగుల్ల
ఓ అన్నలారా, తమ్ములార
ఓ అందమైనా శూరులార.
AndhraBharati AMdhra bhArati - rooDDu veestuu paaDee paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )