దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
51. కోరికలు
కోటాకు యెల్లాలి
కోటాకు యెల్లాని
కోటప్ప కొండాకు - యెల్లీ రావాలి
కోటప్ప తిరుణాలు - సూసీ రావాలీ.

కొండాకు యెల్లాలి
కొండాకు యెల్లాలి
కొండాల తిరుపతి - యెల్లీ రావాలీ
యేడు కొండలోడ్ని - సూసీ రావాలీ.

అలివేలు మంగమ్మ
అలివేలు మంగమ్మ
అలుగూలు తీర్చగ - పోయీ రావాలీ
అలివేలు కుంకూమ - అందీ రావాలీ.
AndhraBharati AMdhra bhArati - koorikalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )