దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
61. బండి తోలుతూ పాడే పాటలు
నిన్ను రమ్మన్నాది
నన్ను రమ్మన్నాది
యిద్దరినీ రమ్మనీ
నిద్దరో తోందో -
నిరా నిరా నిరబండి
గంగీ గళ్ళ పట్టెడెక్కడిదే
గుండెలు తీసిన గుల్లా
నీ గుత్తి నిండా గాజులే
ఓఓఓ దాని కొప్పులోనే
గుప్పెడు సూదులున్నాయిరా
బాగా చూడరబ్బాయ్‌
భాగ్యవంతుల కుఱ్ఱోడా
ఆఆఆ దాని కళ్ళల్లోనే
కలవ రేకులున్నాయిరా
నిన్ను రమ్మన్నాది
నన్ను రమ్మన్నాది
యిద్దరినీ రమ్మనీ
నిద్దరోతోందో
నిరా నిరా నిరబండి
AndhraBharati AMdhra bhArati - baMDi toolutuu paaDee paaTalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )