దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
63. ఓ చిన్నదానా
బంగారు చినదానా
బంగారు జడలదానా
బంగారు జడలామీదా
ఓ చిన్నదానా
మోజెన్నడు లేదే
ఓ చిన్నదానా

గుంటూరు చినదానా
గుండ్రాని కల్లదానా
గుండ్రాని కల్లమీదా
మోజెన్నడు లేదే
ఓ చిన్నదానా
మోజెన్నడు లేదే
ఓ చిన్నదానా

నల్లా నల్లాని దానా
నాతీ నడకాలదానా
నాతీ నడకాలామీదా
మోజెన్నడు లేదే
ఓ చిన్నదానా
మోజెన్నడు లేదే
ఓ చిన్నదానా...
AndhraBharati AMdhra bhArati - O chinnadaanaa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )