దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
69. యేల పాట
ఆకుచిన్నా అడివీలోనా
నాకుచిన్నా దండా దొరికే
దండపేరు కట్లదండేగా
    ఓ కొంటెగాడా

దండసొగసూ చూడగావలెరా
చిన్న చిన్నా పువులూ కోసీ
చిన్నదానీ కొప్పూ ముడిచీ
చల్లనేలల నన్ను దలచేరా
    ఓ కొంటెగాడా

కొప్పు సొగసూ చూడగావలెరా
భద్రగీరి కోనాలోనా
చిత్రమయినా దండా దొరికే
చిత్రమయినా బొమ్మమీదానూ
    ఓ కొంటెగాడా

చిలిపిమనసు చిందులాడేరా
కానరానీ అడవిలోనా
విత్తులేకా చెట్టూ పుట్టే
కొమ్మలేనీ చెట్టుమీదానూ
    ఓ కొంటెగాడా
రెక్కలేనీ పక్షి పుట్టేరా.
AndhraBharati AMdhra bhArati - yeela paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )