దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
70. అయిలేలో
అయిలేలో
అయిలేలో
పిల్లావాడా
పట్టీడ
నేయగలవ
పిల్లవాడా...
    అయిలేలో
    అయిలేలో
    పిల్లదానా
    పట్టీడ
    నేయలేను
    పిల్లదానా...
అయిలేలో
అయిలేలో
పిల్లవాడా
బీడయిన
దున్నగలవ
పిల్లవాడా...
    అయిలేలో
    అయిలేలో
    చిన్నదానా
    దున్నంటే
    దూబరింపు
    చిన్నదానా...
అయిలేలో
అయిలేలో
పిల్లవాడా
మోటైన
గట్టగలవ
పిల్లవాడా...
    అయిలేలో
    అయిలేలో
    చిన్నదానా
    మోటంటె
    మోమంట
    చిన్నదానా...
అయిలేలో
అయిలేలో
చిన్నవాడా
సంతకైన
యెల్లగలవ
చిన్నవాడా...
    అయిలేలో
    అయిలేలో
    చిన్నదానా
    సంతంటే
    సంబరమే
    చిన్నదానా...
అయిలేలో
అయిలేలో
పిల్లవాడా
సరసాలు
ఆడగలవ
పిల్లవాడా...
    అయిలేలో
    అయిలేలో
    చిన్నదానా
    సరసమంటే
    చెవికోత
    చిన్నదానా...
అయిలేలో
అయిలేలో
చిన్నవాడా
సంతాకు
వస్తావ
చిన్నవాడా...
    సరసా
    కూకుంటాను
    చిన్నదానా
    సరసాలు
    ఆడతాను
    చిన్నదానా...
AndhraBharati AMdhra bhArati - ayileeloo jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )