దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
73. పూల పాట
బంతి పూచిందీ
బంతి పూచిందీ
బంతూలవలె - పూ
బంతి పూచిందీ.
    మల్లి పూచిందీ
    మల్లి పూచిందీ
    మాయింటమల్లె - పూ
    గుత్తీ పూచిందీ.
పూవూ నవ్విందీ
పూవూ నవ్విందీ
పూలకన్య సిగలో
పూవూ నవ్విందీ.
    కన్నె మురిసిందీ
    కన్నె మురిసిందీ
    సిగలోన పూలుచూసి
    కన్నె మురిసిందీ.
AndhraBharati AMdhra bhArati - puula paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )