దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
75. రోడ్డుబంటా పాట
ఓ అన్నలార
తమ్ములార
ఓ యందమైన
శూరులార
పట్టండీ
పట్టండీ జాన
ఓ పట్టనోడి
నోటి లోన
పచ్చిమిరప
పాలు పొయ్య
ఓ దిబ్బమీదా
దీప మెట్టి
దేముడానీ
మొక్కబోతే
దయ్యమాయి
తరుమ బోయె
ఓ పలకండ్ర
పలకండ్ర జాన
ఓ మడత మేనీ
చిరుత కఱ్ఱ
చిరుత కఱ్ఱ
కంచు మ్రోగు
కనుము మ్రోగు
కట్టగాదూ
మూరు డన్న
జాన కొకటి
బార కొకటి
ఆ పట్టండి
పట్టండి జాన...
AndhraBharati AMdhra bhArati - rooDDubaMTaa paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )