దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
79. చుక్కాని పాట
ఓ రేడి కొయ్య
ఓడ మీదా
ఓ రేడి కొయ్యా
ఓడ మీదా...

చూడ చక్కని
చిన్నా దొచ్చి
ఉంగరాలా
చెయ్యీ చూసె
ఉండదయ్యా
పిల్లా మనసు
చూడ చక్కని
చిన్నా దయ్యా
ఓ రేడి కొయ్యా
ఓడా మీదా...

ఓ అన్నలారా
తమ్మూలారా
పలక నోడి
నోటిలోనా
పనికి మానీ
పాలూ పొయ్యా
చూడ చక్కని
చిన్నా దయ్యా
ఓ రేడి కొయ్యా
ఓడా మీదా...

ఓ అన్నలారా
శూరూలారా
పలికి నోళ్లా
నోటిలోనా
పనసదారా
పాలూ పొయ్యా
చూడ చక్కని
చిన్నా దయ్యా
ఓ రేడి కొయ్యా
ఓడా మీదా...
AndhraBharati AMdhra bhArati - chukkaani paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )