దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
85. సాలుదున్ను
సాలు దున్ను
సాలు దున్ను ఓ బావా
సాలాడి నేతకాదు ఓ బావా.

విత్తులయిన
జల్ల గలవ        ఓ బావా.
వీరత్వం
చూపించు        ఓ బావా.
మోటైన
కట్ట గలవ        ఓ బావా.
నిమ్మళ్లు
నిండుతాయి        ఓ బావా.
కోతలన్ని
వచ్చినాయి        ఓ బావా.
కోరినట్టి
రైకలియ్యి        ఓ బావా.
రాసుల్లు
పోశావ        ఓ బావా.
గాదుల్లు
కట్టావ        ఓ బావా.
రాసులయిన
నింపావ        ఓ బావా.
కాసులయిన
కడ్తావ        ఓ బావా.
AndhraBharati AMdhra bhArati - saaludunnu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )