దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
87. ఊతపదాలు
అన్నల్లు వచ్చారు
కూరేమి కూర
ఆ సువ్వి - ఆ సువ్వి...

అలచంద పప్పు
అడవి కాకరకాయ
ఆ సువ్వి - ఆ సువ్వి...

బావల్లు వచ్చారు
కూరేమి కూర
ఆ సువ్వి - ఆ సువ్వి...

పాదుల్లో తొండల్లు
గోడ బల్లుల్లు
ఆ సువ్వి - ఆ సువ్వి...
AndhraBharati AMdhra bhArati - uutapadaalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )