దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
89. అప్పగింతలు
ఎల్లొస్తావా బావ
ఎళ్లొస్తావా...
ఎల్లొస్తావా బావ
ఎగిరొస్తావా?
    ఏనాడు పిలచీన
    ఎందూకు పిలచీన
    ఎగిరొస్తానే పిల్ల
    ఎళ్లొస్తానే
    ఎళ్లొస్తానే పిల్ల
    ఎగిరొస్తానే.
ఎళ్లిపోతూ నీవు
యేటోను సెప్పావు
ఎగిరొస్తావా బావ
తిరిగొస్తావా?
తిరిగొస్తావా బావ
ఎళ్ళొస్తావా?
    ఆ - అంటె అడవులు
    కో - అంటె కోనలు
    దాటొస్తానే పిల్ల
    ఎగిరొస్తానే
    ఎగిరొస్తానే పిల్ల
    ఎళ్లొస్తానే.
అడవులు కోనలు
వరదాలు - పరదాలు
దాటొస్తావా బావ
ఎగిరొస్తావా?
ఎగిరొస్తావా బావ
మళ్లొస్తావా?
AndhraBharati AMdhra bhArati - appagiMtalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )