దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
94. చుక్కలచొక్కా
చక్కానీ పిల్లా వాడా
చుక్కాల చొక్కా వాడా
చల్లమ్మ నాతో వస్తే
ఓ పిల్లావాడా
చక్కాగ ఉంటాదిరోయ్‌
ఓ పిల్లవాడా...
    నీలాల కళ్ళదానా
    నీలాపు చీరదానా
    నిక్కంగ నాతోవుంటే
    నీకేమి లోటే
    ఓ చిన్నదానా
    నీకేమి లోటే
    ఓ చిన్నదానా...
చల్లమ్మ వెడుతూ వుంటే
చుక్కాల చొక్కాయేసి
చల్లగ నీతో రానే
ఓ చిన్నదానా
సరసాలు ఆడా రానే
ఓ చిన్నదానా...
    చుక్కలచొక్కా వాడా
    చుంచు మీసాలవాడా
    దారులంట రాకురోయ్‌
    ఓ చిన్నవాడా
    నా యన్న చూస్తాడు
    ఓ చిన్న వాడా...
AndhraBharati AMdhra bhArati - chukkalachokkaa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )