దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

018. పొలిపదం


రైతు తెలివితక్కువవాడైతే ఎంత పంటయినా గుడగుడాయిస్వాహా అవుతుంది. చివరికి మిగిలేది ఏమిటి? చిత్తగించండి.

కల్లు దుర్గామొచ్చి; గూగుమ్మడి;
కళ్ళములో, కూకుండే; గూగుమ్మడీ;
చేత పైసాలేదు, గూగుమ్మడీ;
ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ;
    కాడి యెద్దులనమ్మి; గూగుమ్మడీ;
    కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ;

కల్లు దుర్గామొచ్చి, గూగుమ్మడీ;
కళ్ళములో, కూకుండె; గూగుమ్మడీ;
చేతపైసాలేదు, గూగుమ్మడీ;
ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ;
    పాడి బర్లానమ్మి; గూగుమ్మడీ;
    కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ;

కల్లు దుర్గామొచ్చి, గూగుమ్మడీ;
కళ్ళములో, కూకుండె; గూగుమ్మడీ;
చేతపైసాలేది, గూగుమ్మడీ;
ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ;
    తల్లిదండ్రులనమ్మి; గూగుమ్మడీ;
    కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ;

కల్లు దుర్గామొచ్చి, గూగుమ్మడీ;
కళ్ళములో, కూకుండె; గూగుమ్మడీ;
చేతపైసాలేది, గూగుమ్మడీ;
ఏంపెట్టి త్రాగేది? గూగుమ్మడీ;
    పెళ్లాన్ని పరులకమ్మి; గూగుమ్మడీ;
    కల్లు త్రాగవయ్య; గూగుమ్మడీ;

పెళ్లాన్ని పరులకమ్మి; గూగుమ్మడీ;
బ్రతుకకుంటే నేమి? గూగుమ్మడీ;
    కల్లు దుర్గామపుడు; గూగుమ్మడీ;
    కళ్లమొదిలీపోయె; గూగుమ్మడీ;

చావుకు పెట్టిననేకాని లంఖణాలవరకూ రాదు. పెళ్లాన్ని పరులకమ్మేవరకూ నడుపుతుందా కల్లు త్రాగుడు? అయితే వద్దన్నాడు. కల్లుదుర్గము కళ్లమువదలి పారిపోయింది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - polipadaM - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )