దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

019. ఏతాము


పాట భారతీయులకు జాతీయ కళ. పుట్టినరోజున పాట, తొట్టె పెట్టినపుడు పాట, అన్న ప్రాశనానికి పాట, విద్దెము చేసినప్పుడు పాట, ఆడుతూ పాట, పెండ్లికి పాట, శోభనానికి పాట, సీమంతానికి పాట, భారతీయుల జీవితాన్నంతా పాట పడవ అయి తేల్చి సాగిస్తుంది. గానసరస్వతి అరచేత పెరిగిన తెలుగుబిడ్డ ఆటలలోనూ, పాటలలోనూ మాత్రమే కాక పనిపాటులలో కూడా పాడుకుంటూనే కష్టపడతాడు.

ఏతాము విరిగినట్లయితే ముగ్గురికి చావు. అట్లని ఏతాము పట్టడము మానగలరా? గూళ్ళు నొప్పనకుండా గూనలు లాగిననే మెఱకచేలు తడిసి గింజలు పండగలవు.

ఏతాము తోడరా తమ్ముడా, నీ
చేతైన సాయమదే తమ్ముడా
పాతాళ గంగమ్మ పైకుబికి పొంగింది
యేతాము తోడి మెఱకసేలన్ని తడపాలి
గూళ్ళు నొప్పనకుండా గూనలు లాగాలి బేగి
సేలన్ని తడిసి మరి మూనలు బాగెదగాలి
కట్ట తెగిపోకుండ కట్టండి గట్లన్ని
బద్దిపై సిన్నోడ భద్రముగ నడవాలి
పట్టు తప్పితె పళ్ళు పలపల రాలాయి గాని
ఏతమెక్కిన వాడు ఏరు కట్టిన వాడు
ఏటేట పంటలతో యెలగాలి పదినాళ్ళు
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - EtAmu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )