దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

020. ఏతాము పాట


ఆశలు ఆశలనంటును. పాపము ఆచరణలో ఏతాము రైతు పాట్లు చూడండి.

ఏటికేతం పట్టి వెయి పుట్లు పండించి
    ఎన్నడూ మెతుకెరగరన్నా
    నేను గంజిలో మెతుకెరగరన్నా
కాల్జేయి కడుక్కొని కట్టమీద కూసుంటె
    కాకి దన్నీ పాయెరన్నా - కాకి
    పిల్ల దన్నీ పాయెరన్నా
పోరుకూ జాల్లేక పొయికాడ కూసుంటె
    పోరి దన్నీ పోయెరన్నా - పోరి
    తల్లీ దన్నీ పోయెరన్నా
చుక్కపొద్దున లేచి బొక్కెనెత్తా పోగ
    బొక్క బోర్లా పడితిరన్నా
    నాదేటి బ్రతుకాయెరన్నా
    నేను నాడే చావకపోతిరన్నా

వీడెవడో ప్రత్యేకముగా దురదృష్టవంతుడు. మెతుకు మాట దేవుడెరుగును, కాకిపిల్ల తన్నులు కూడా తిన్నాడు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - EtAmu pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )