దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

030. గడ్డిపాట


రైతునకు 'ఏరువాకమ్మ', మాలెతలకు గడ్డిమాతల్లి! భూమి మీద మోసగించని పంట, సర్వవ్యాపి అయిన పెద్ద పంట, గడ్డి పంటయే. మాలెతల అభిమానము గమనించండి.

కడుపు చల్లని తల్లి
గడ్డి మాతల్లి
పిడికిటికి రావమ్మ
కొడవటికి రావే
గడ్డి కూడే తింటూ
గడ్డి తోనే ఉంటూ
గడ్డిలో పాణమొదిలి
కైలాసం సూత్తాము
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gaDDipATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )