దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

034. విసురురాతి పదము - 4


సకియ యిల్లు జొచ్చి యెల్లజాలడె
సక్కన్ని వాడమ్మ సారంగధరుడు
ఇరుగుపొరుగమ్మలార ఇతని పొమ్మనర
ఇరుగోరి మాటలు వినవిచ్చిరేను
పొరుగోరి మాటలు పొనవచ్చిరేను
చిలుక నీళ్ళుతోడె జలకమాడేను
హంస అన్నములొండె ఆరగించేను
వెలదీమంచములేయె వెన్నెల బైట
పడతి పానుపులెయ్యె పవ్వళించేను
ఆకుతేవె పోక తేవె అడకత్తి తేవె
చూడ సున్నపుకాయ చుట్టియ్యె మడుపు
సన్నంగ చుట్టీయె సగము కొరికీయె
యెంగిలెంగిలి శివుడ యెగ్గు పట్టేవు
మనకేమి యెంగిలీ పుణ్యపురుషులకు
విసినె కర్రలుతోను విసిరె ఒక జాము
ఇసిరిసిరి ఆ కాంత స్తంభాని కొరిగె
కాంతకీ కన్నీళ్ళు కాల్వలై పారె
వానకురవలేదీ వరద యెక్కడిది
అమ్మరొ మన యింట్లొ వొరువలెక్కడివె
నువుపోయి పరసింట్లొ పండుంటివి కొడక
ఆడవారి శోకంబు అటువంటిదప్ప

వీని వరసలు ద్విపద వరసల్లాగ కనబడతవి. కాని వీటిలో ద్విపదల గణనియమము కనబడదు. ఇవి నాలుగేసి కిటతకిట ఆవృతాల పాదాల పాటలు. పాడేవారు పాదానికి ఇరవై మాత్రలు ఏదోరీతిని కిట్టించేస్తారు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - visururAti padamu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )