దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

037. కవ్వము పాట


ఈ కవ్వము పాట కిటతక కిటతక అని నాలుగక్షరాల ఆవృతాలతో నడుస్తూ కోలాటాని కనుకూలముగా ఉన్నది. కోలాటపు పాటే అన్నా నమ్మవచ్చును.

అన్నా బిందేటి పాలు - కిన్నెరల మోత
    అమ్మా చేసేదీ చల్లోయీ
అమ్మా చేసేదీ చల్లా - కవ్వాల మోత
    రాగిదీ కవ్వామోయీ
రాగిదీ కవ్వాము - రవ్వాడే వెన్నె
    చింతాదీ కవ్వామోయీ
చింతాదీ కవ్వామూ - చిల్లాడె వెన్న
    దంతేదీ కవ్వామోయీ
దంతేదీ కవ్వామూ - ధ్వనులెల్ల చల్ల
    ఉక్కూదీ కవ్వామోయీ
ఉక్కూదీ కవ్వామూ - ఊగోచు వెన్న
    రేపల్లె వాడలోయీ
రేపల్లి వాడల చల్లమ్మ చల్ల
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kavvamu pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )