దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

040. చెంచువారు


చెంచువారిళ్ళలో చెడ్డకొలవని వారు
    చేరుటమ్ముల చేతనూ
వీపునాయిమరిల్లు విల్లుటంబులు చేత
    యిల్లు వెళ్ళని చెంచులూ
పొద్దుపోయె యింటికి పోవాలె గూటికీ
    దోవదొలుగూ ఓగులూ
పొద్దుపోతే కనుక బద్దికురులున్నాయి
    వెతకవే వెదురు బియ్యము
వెదురు బియ్యపు కూడు మదన చక్కెర తోడ
    మదములేకలబలకవు
ముదముదగమాను ముందరది నెల్లీవనము
    ముందరిది నెల్లీవనమూ
మెట్టికాళ్ళాదాన మెట్టించి నడచేవు
    కాలి ముల్లిరగదంటే
అరికాల్లొ ఉన్నాది అరవై ఆరు ముళ్ళు
    ఆడదీ జాణతనమూ
కూచ్చొనీ ఆ ముల్లు కుదురుగా తియబోతే
    కుదరనీయరు చెంచులూ
పండుకోనీ ముల్లు పాటిగా తియబోతే
    పండనీయరు చెంచులూ
చెంచువారిళ్ళలో చెడ్డకొలవని వారు
    చేరుటమ్ముల చేతనూ
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - cheMchuvAru - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )