దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

041. కాకర పువ్వొప్పునే


1
పల్లవి:కాకర పువ్వొప్పునే? గౌరమ్మ! కాకర పండొప్పునే    ॥గౌ॥
మిత్రం: కాకర, పువు మీద! వాలిన చిలుకలు
వసంత రేకులు, గైకో గబ్బలు
మైకో మేడలు, చందమామ నీడలు
సవరపు దండలు!
ఆ గడియలో శ్రీ గడియలు -
దంచిన పాలు। ధరణికి లొంగవు।
దానత్త పోసిన। పట్టెళ్ళు।
కో; కో; తడపలు। రాముడుయ్యలు।
గంటసిరి మువ్వలు। గౌరమ్మా! నీ సుతుడేడే?
వాడిన పువ్వులు, వడిలో బోసుక
వాడలు నెలికిన। లేడమ్మా!
సరి, మేడలు నెలికిన। లేడమ్మా!

2
పల్లవి:చిక్కుడు పువ్వొప్పునే? గౌరమ్మ! చిక్కుడు కాయొప్పునే?
మిత్రం:చిక్కుడు పువు మీద। వాలిన చిలుకలు
(పై మాదిరిగా మిగిలినది పాడవలయును.)

3
పల్లవి:బీరయ్య పువ్వొప్పునే? గౌరమ్మ! బీరయ్య పిందొప్పునే?
మిత్రం:బీరయ్య పువు మీద। వాలిన చిలుకలు
(పై మాదిరిగా మిగిలినది పాడవలయును.)
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kAkara puvvoppunE - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )