దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

069. తడికా, తడికా


భార్యాభర్తల నడుమ కలతలు వచ్చినవి. అంతలోనే బిర్రు హెచ్చినది. మాటలాడుట కూడ చిన్నతనమే. తడికకు మధ్యవర్తిత్వము ఆవహించినది. అయితే ఎంతసేపుండగలవు ఈ తాపాలు?

వంకాయ, వండాను । వరికూడు వార్చాను,
తినమని చెప్పవే? తడికా! తడికా!
వగలాడి మాటలకు । వళ్ళంత మండింది
వద్దని చెప్పవే? తడికా! తడికా!

పట్టుచీర తెచ్చాను । పెట్టెలో పెట్టాను
కట్టమని చెప్పవే? తడికా! తడికా!
చీరకంచులు లేవు । చుట్టుచెంగులు లేవు
వద్దని చెప్పవే? తడికా! తడికా!
సంతలోకి వెళ్ళి । సరిగంచు చీరను
అద్దాల రవికెను । అతివ తెచ్చెద కట్టుకోవే!
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - taDikA, taDikA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )