దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

077. వేరే పోదామా


అవిభక్త కుటుంబపు నీడలోనే వేరింటి కాపురము గూడు కట్టును. ప్రౌఢ తన భర్త నడుగుచున్నది.

సందమామ కన్న సక్కాని మొగుడా
వేరే పోదామా?
అత్తమామల పోరు నేను పడలేను
ఆడబిడ్డల పోరు నేను పడలేను
॥ సం ॥
ఉంగరాల చేయి ఊగెరా మొగుడా
కందిరీగా నడుము కదిలేర మొగుడా
వేరే పోదామా?
॥ సం ॥
కొండంత కొప్పేమొ కదిలేర మొగుడా
కొప్పుపై జాజులు వాడెరా మొగుడా
వేరే పోదామా?
॥ సం ॥

లక్కరాజు గంగయదాసు పాట ఒకటి ఇటువంటిదే కాని ఇంతకన్న పెద్దది ఉన్నది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - vErE pOdAmA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )