దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

079. సిరి సిరి మువ్వ పాట


అయితే నగలతో సంతుష్టి చేకూర గలదా? ఎన్నాళ్ళు సవతి బాధ భరించగలదు మగనాలు?

ఈ ముండ కాపురము॥సిరి సిరి మువ్వ ॥
నాకే ముండ తెచ్చింది॥ సి ॥
అన్నపూర్ణ కాపురము॥ సి ॥
కన్నవారి యిల్లు కాదా॥ సి ॥
రంగమ్మ కాపురము॥ సి ॥
రత్నాల మూట కాదా॥ సి ॥
ప్రక్క పాపిడేలనని॥ సి ॥
ప్రక్కలిరగ తన్నేడే॥ సి ॥
జాకెట్టు తొడిగితే॥ సి ॥
షోకేల నని తన్నేడే॥ సి ॥
పాకిదాని లాగుంటేని॥ సి ॥
పకపక వాడు నవ్వేడే॥ సి ॥

"కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!"
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - siri siri muvva pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )