దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

087. సాముద్రికం


కోయమామ చెయ్యిచూచి సాముద్రికం కూడా చెప్పగలడు.

సేయిసూస్తా రా పిల్ల
సేతిలో బంగారు రేకున్నది;
కుళ్ళాయి కుచ్చుంది
కూకుని తింటావు పిల్ల;
బాలెంత రూపుంది
బాధ పడతావు పిల్ల;
బండి మీద కల్లుంది
బహు జోరుగా వుంది;
తాగు తాగు పిల్ల
తన్నుల్తింటావు పిల్ల    ॥సేయి॥

ఇవి పూర్తిగా పరమార్థమున్నూ కాదు, పరిహాసమున్నూ కాదు. అక్కడే ఉంది వీని అందము.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - sAmudrikaM - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )