దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

089. కాశీ కావడి


గంటల కావడితో కాశీ పాటాలు చూపించటానికి యాత్రికుడు వస్తున్నాడు. కావడి దింపటమూ, తట్టల చీరలు ముళ్ళు విప్పటమూ, చూడవచ్చిన వారిని సర్ది కూర్చొనబెట్టటమూ, ఒక్కొక్క పటమూ విప్పి ప్రదర్శించటమూ - మొత్తమొక అరగంట ప్రదర్శనము!

కాశీకి పోయాను రామహరీ
కాశి తీర్థమూ తెచ్చాను రామహరీ
    కాశీకి పోలేదు రామహరీ
    వూరి కాలవలొ నీళ్ళండి రామహరీ
కాశీకి పోయాను రామహరీ
కాశి విభూతి తెచ్చాను రామహరీ
    కాశీకి పోలేదు రామహరీ
    వీడి కాష్ఠంలో బూడిదండి రామహరీ
పంచేంద్రియములూ రామహరీ
నేను బంధించియున్నాను రామహరీ
    కొంచెము నమ్మినా రామహరీ
    కొంప ముంచి వేస్తాడండి రామహరీ
ఆలుబిడ్డలు లేరు రామహరీ నేను
ఆత్మ యోగినండి రామహరీ
    ఆలుబిడ్డాలెల్ల రామహరీ వీని
    కాయూర నున్నారు రామహరీ

వెనక మాటలు చెప్పేవాడు వాని బంధువే.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kASI kAvaDi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )