దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

090. పైస తమాషా


ఏదో టక్కుటక్కుమని వాద్యం వినబడుతున్నది. నల్లకోటూ, ఎర్ర తలపాగా, అద్దాలు మెరుస్తూ తాలూకా కచేరీ ఆకారంతో కొయ్యపెట్టే జోరుగా వున్నది వీని వ్యాపారము! చెంపలకు చేతులు చేర్చుకుని, వంగి, పెట్టెలోని బొమ్మలను ఆప్యాయముతో చూస్తున్నారు పిల్లలు. వీరికన్నా చుట్టూ ఉన్నవారి కోలాహలం జాస్తిగా ఉన్నది. వాద్యమనుకున్నాము. గోళ్ళతో కొట్టుతూ, చేతిచిరుకట్టెతో లయనిలుపుతూ పాడుతున్నాడు.

పైస తమాషా చూడర బాబూ
ఏమిలాహిగా నున్నది చూడు
ఏమి తమాషాలున్నయి చూడు
కాశీ పట్నం చూడర బాబూ
కలకల లాడే గంగా నదిని
కన్నుల కఱవుగ చూడర బాబూ
హరిశ్చంద్రుడు సత్యంకోసం
ఆలిబిడ్డలను అమ్మిన చోటు
అదుగదుగదుగో విశ్వేశ్వరుడు
హర హర హర యను భక్తుల చూడు
చూచి మోక్షం పొందర బాబూ    ॥పైస॥
హస్తినాపురీ పట్నం చూడు
పాండవులేలిన పట్నం చూడు
తాజమహలును చూడర బాబు
కృష్ణదేవరాయలని చూడు
బెజవాడలో కనకదుర్గను
భద్రాచలములో రామదాసును
కన్నుల పండువుగ చూడర బాబూ
చూచి జ్ఞానం పొందర బాబూ
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - paisa tamAShA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )