దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

091. కోతికి బుద్ధులు


వీధులు వదిలి సందులలో ప్రవేశిస్తాము. ఆయింటి ముంగిట ఏదో సందడి. ఆవారనుంచి పోతే గృహిణులందరూ లేచిపోతారు. ఈవారనుంచి ఏమీ యెరగనట్టుగా పదండి. ఎరుకల చిన్నది కోతిని తెచ్చినది. కోతి ఏదో పనులు చేస్తున్నది.

పతివ్రతా ధర్మంబు భక్తిగా సలిపి
అతనిచెంప మీద అంటిస్తూ ఉండు
మగనితో నీకసలు మైత్రి సరిపడక
పగదానివలె మీద పడజూడె తల్లి
అత్తమామల తోటి అనువుగాకుంటె
క్రొత్తముగ్గులు పెట్టి కుంగదియ్యావే
సేవచెయ్యించుకో చిన్నత్త చేత
బావగారిని నీదు బానిసగ జూడు
మరదుల నట్టిట్టు మన్నించబోకు
యిరుగు పొరుగులతోటి యిచ్చకములాడు
అంపకములానాడు అడగవచ్చితే
కొంపగదలక కోపించుకోవే
పెద్దలు నిన్నొచ్చి పిలువజూచితే
పెద్దపెట్టున గోలపెట్టి ఆటాడె
ఏకువలె మెత్తంగ నెరుగనట్లుండి
మేకురీతిని బిగిసి మేలుకొనియుండు
కయ్యంబులకు ముందు కాలు దువ్వుచును
పొయ్యి కడకేబోక బుద్ధి కలిగుండు
అంకినకాడికి అమరజూచుకుని
జంకు చెందక బార జాచిపోరాడె
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kOtiki buddhulu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )