దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

093. పల్లెవాని స్వీయచరిత్ర


వీడేవడు? వీపున వల, నెత్తికి సన్నగా అల్లిన తాటాకు టోపీ, చేతిలో మురికి సంచీ!

నేను; పల్లోళ్ళ, కుఱ్ఱోణ్ణి బాబు;
నన్ను; కొట్టొద్దు, తిట్టొద్దు బాబు;
నేను; దోసేది, బుఱ్ఱ సంగడి బాబు;
నేను; యేసేది యిసురు వల బాబు;
నాను; పుట్టింది, పూలపల్లి పుంత;
నాను; పెరిగింది, పెదపూడి సంత;
నా; బాబు పేరు, జల్లకొంకు బాబు;
నా; అమ్మ పేరు, మట్ట గిడస బాబు;
నా; చెల్లెలు పేరు, చేదుపరిగె బాబు;
నా; తమ్ముడు పేరు, రొయ్యి పీసు బాబు;
నా; పెళ్ళం పేరు, యిసుక దొందు బాబు;
నా; పేరు, బొమ్మిడాయి బాబు;    ॥నే॥

ఆ సంచిలో ఈ చేపలున్నవి కాబోలు. వీడు ఎవడో కొత్తవాడు. ఎప్పుడూ చూడలేదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pallevAni swIyacharitra - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )